Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Sangareddy: మెదక్ కంచుకోట బద్దలు

Sangareddy: మెదక్ కంచుకోట బద్దలు

కేసీఆర్ సర్వం ఒడ్డినా

బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిలుస్తున్న మెదక్లో మళ్లీ తామే పాగా వేస్తామంటూ బీఆర్ఎస్ కోటి ఆశలు పెట్టుకుంది. ఈ ప్రాంతంలోని ఉద్యమ నేపథ్యంతోపాటు అభివృద్ధి, దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సర్వశక్తులు ఉపయోగించిన గెలువ లేకపోయారు.

- Advertisement -

అంతేగాకుండా బీఆర్ ఎస్ అభ్యర్థి వెంకట్రామారెడ్డికి పార్టీ బలంతోపాటు తన సొంత హామీలు కూడా కలిసివస్తాయనే అంచనాలు ఉన్నాయి. వీటన్నింటితో పాటు తాజా ఎగ్జిట్పోల్ ఫలితాల్లోనూ మెదక్ లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని మెజార్జీ ఏజన్సీలు చెప్పకనే చెప్పాయి. కొన్ని ఏజన్సీలు మాత్రం ఇక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు విజయం సాధిస్తారని ప్రకటించాయి అది నిజమే అయ్యింది. గత పార్లమెంటు ఎన్నికలతో పాటు గడిచిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రఘునందన్కు అనుకూల వాతావ రణం కనిపించిందని, మోదీ చరిష్మా కలిసివచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మెదక్ ప్రజలు పట్టం కట్టారు.
దుబ్బాక నియోజకవర్గం మరోసారి రికార్డులోకి ఎక్కింది. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేసిన రఘునందన్ రావు భారీ మెజారిటీతో గెలుపొందారు. రఘునందన్ రావు స్వస్థలం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం బొప్పాపూర్ గ్రామం. గతంలో రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని పోతారం గ్రామ వాస్తవ్యుడు. 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేసి గెలుపొందగా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో కాళీ అయిన ఎంపీ స్థానం ఉప ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డికి అవకాశం కల్పించారు. 2014 ఉప ఎన్నికలలో ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడమే కాకుండా 2019లో జరిగిన ఎన్నికల్లో సైతం విజయఢంకా మోగించారు.

తాజాగా జరిగిన పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులలో పటాన్చెరు ప్రాంతానికి చెందిన నీలం మధు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా అమీన్పూర్ ప్రాంతానికి చెందిన వెంకట్రాంరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేశారు. దుబ్బాక ప్రాంతానికి చెందిన రఘునందన్ రావు బీజేపీ నుండి పోటీ చేసి గెలుపొందడంతో దుబ్బాక ప్రజలకు మరోసారి మెదక్ ఎంపీ స్థానాన్ని కానుకగా ఇచ్చారు. మోడీ ప్రభంజనం రఘునందన్ రావు వ్యక్తిగత చరిష్మాతో ఈ ఎన్నికల్లో మెజారిటీ సాధించి విజయం పొందారు. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడా కూడా బీజేపీ ఎమ్మెల్యేలు లేనప్పటికీ విజయం సాధించడం గొప్పగా భావించాల్సిన విషయం. నిన్న మొన్నటి దాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ తమ అభ్యర్థి శాసనమండలి సభ్యుడు వెంకటరామిరెడ్డిని గెలిపించుకోలేకపోవడం బీఆర్ఎస్ ప్రభావం తగ్గిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News