రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ లక్ష్మీ పథకం లబ్ధిదారులను గ్రామ సభలను ఏర్పాటు చేసి ఎంపిక చేయాలని ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులకు ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారని మంత్రి హరీష్ రావు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో నామమాత్రంగా పోడు భూములకు పట్టాలు అందించారని అడవుల్లోని వారందరికీ పోడు భూముల పట్టాలు అందించాలని, అటవీ హక్కుల చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తలాపునే ఉన్న గోదావరి నీటి జిల్లాలు ఇతర జిల్లాలకు తరలిపోతున్నప్పటికీ ఇక్కడి ప్రాంతానికి ఒక్క చుక్క నీరు రావడం లేదని, దీంతో రైతులు ఇబ్బందుల గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసే మల్లంపల్లి మండలానికి జడ్పీ చైన్ పర్సన్ గా పనిచేసి మృతి చెందిన కుసుమ జగదీష్ పేరు పెట్టాలని సీతక్క కోరారు.
Seethakka: ‘గృహలక్ష్మి’ లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభలతోనే చేయాలి
మల్లంపల్లికి కుసుమ జగదీష్ పేరు పెట్టండి