వందేళ్ల శతజయంతి సభలు జరుపుకున్నాం కానీ అధికారంలోకి ఎందుకు రాలేకపోతున్నామో ఆలోచించాలని పార్టీ శ్రేణులను కోరారు సీసీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి. ఆదివారం సిద్దిపేట నిర్వహించిన పార్టీ వందేళ్ల ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలి
ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి రావడానికి మరింత ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరముందన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేస్తోన్న బిజెపి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. బీజేపీ పాలనలో అన్ని వర్గాలు హక్కులు కోల్పోయాయన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల్లో ఉండి పేదల హక్కుల కోసం మరోసారి పోరాటాలకు సిద్ధం కావాలని చాడ పిలుపునిచ్చారు.
ఈసభలో సిపిఐ పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఎడ్లవెంకట రామిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గడిపే మల్లేష్, బట్టు దయానంద రెడ్డి, అందే అశోక్, ఎడల వనేష్, పోతిరెడ్డి వెంకటరెడ్డి, కిష్టపురం లక్ష్మణ్, జాగిరి సత్యనారాయణ గౌడ్, కనుకుంట్ల శంకర్, స్వాతంత్ర సమర యోధుడు గంబీరపు రామయ్య, పట్టణ కార్యదర్శి జీ.బన్సీలాల్, జెరిపోతుల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.