Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Harish Rao: లక్ష్య సాధన కోసం లక్ష మందితో సభ

Harish Rao: లక్ష్య సాధన కోసం లక్ష మందితో సభ

సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ

బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రజల హృదయాలు ఆనందంతో పొంగుతుంటే ప్రతిపక్షాల గుండెలు జారిపోయాయి. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఆనాడు నోటుకు ఓటుకు.. ఈరోజు నోట్లకి సీట్లు బిజెపికి పోటీ చేసేందుకు నాయకులే లేరు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే రాజ్ నాథ్ సింగ్ నవ్వుల పాలవడం తప్ప ఏమీ కాదు సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహణపై మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశం

- Advertisement -

మంత్రి హరీష్ రావు కామెంట్స్ :

లక్ష మందితో సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహణ. బీఆర్ఎస్ పార్టీ అన్నిట్లో ముందుంది. అభ్యర్థుల ప్రకటనలో, మ్యానిఫెస్టో ప్రకటనలో, అదేవిధంగా రేపు గెలుపులో కూడా ముందుంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సిద్దిపేటలో పుట్టిన బిడ్డగా సిద్దిపేట కీర్తిని ప్రపంచ పటంలో నిలబెట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్.

సిద్దిపేట మట్టి బిడ్డ కెసిఆర్ సిద్దిపేట జిల్లాను సాధించాడు. స్వచ్ఛందంగా తరలివచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఘన స్వాగతం పలకాలి.

4:45 ప్రాంతంలో సిద్దిపేటకు హెలికాప్టర్ లో సిరిసిల్ల నుండి రానున్నారు.

5.30 సభ ప్రారంభించుకుంటాం. 20వేల మంది విద్యార్థులు బైక్ ర్యాలీ ద్వారా స్వచ్ఛందంగా సభకు రానున్నారు.

రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, లాయర్లు, డాక్టర్లు అందరూ ఈ సభకు విచ్చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.

బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు.

బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రజల హృదయాలు ఆనందంతో పొంగుతుంటే ప్రతిపక్షాల గుండెలు జారిపోయాయి.

ముఖ్యమంత్రి గారు కుటుంబ పెద్దలా ఆలోచించి ఆచి తూచి మేనిఫెస్టోని తయారు చేశారు.

ఆసరా పెన్షన్ అయినా, దళిత బంధువైన, రైతు బంధువైన, రైతు బీమా అయినా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలకు నగదు పెంచి పేరు మార్చి ప్రవేశపెడతామని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మా పథకాలను కాపీ కొట్టింది.

నమ్మకానికి మారుపేరు కెసిఆర్ నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ.

రానే రాదు కనే కాదు అన్న తెలంగాణను తెచ్చి చూపించిన నాయకుడు కేసీఆర్. అంత బాధ్యతగా తెలంగాణ పట్ల ఎవరు ఉండరు.

కెసిఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా.. సౌబాగ్య లక్ష్మీ వంటి పథకాలను మహిళ కోసం తెచ్చిన మహిళా పక్షపాతి కెసిఆర్ గారు. ప్రతి నెల మహిళకు 3000 ఇవ్వాలని సౌభాగ్యా లక్ష్మి తేనున్నారు.

గ్యాస్ పొయ్యితో, గ్యాస్బండతో బీజేపీ సెగ పెట్టింది. సిలిండర్ ని 400 రూపాయలకే పేదలకు అందించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు.

మరో అద్భుతమైన పథకం ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టారు. గత పాలకులు ముక్కిపోయిన, కుళ్ళిపోయిన బియ్యం ఇచ్చేవారు.

ఆసరా పెన్షన్లను 5 వేలకు పెంచడం వికలాంగులకు 6000 పెంచడం రైతుబంధుని 16000కు పెంచుతూ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.

మహిళలందరూ కొంగులు నడుముకు కట్టి నడవవే రామక్క బీఆర్ఎస్ కు ఓటేద్దామని పాట రూపంలో ఉత్సాహంగా బీఆర్ఎస్ కి మద్దతు తెలుపుతున్నారు.

టికెట్లు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల నిజరూపం బయటపడుతున్నది. 10 కోట్లకు టికెట్ అమ్ముకున్నారు ఐదు ఎకరాలకు టికెట్ అమ్ముకున్నారని ఢిల్లీలో గల్లీలో కాంగ్రెస్ నాయకులు నిరసనలు తెలుపుతున్నారు.

కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఆనాడు నోటుకు ఓటుకు అడ్డంగా దొరికితే, ఈరోజు నోట్లకి సీట్లు అమ్ముకుంటున్నారని గాంధీభవన్లో కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు.

బిజెపి రాజ్నాథ్ సింగ్ తెలంగాణ కొచ్చి ఎక్కువమాట్లాడుతున్నారు. బిజెపికి పోటీ చేసేందుకు నాయకులే లేరు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇలాంటివారు కూడా ఎమ్మెల్యేకి పోటీ చేయం ఎంపీకి పోటీ చేస్తాం అని తప్పించుకుంటున్నారు.

ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణపై అక్కసు చాలాసార్లు వెళ్లగక్కారు.

తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను ఆపి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీ పార్టీ తెలంగాణకు చేసిన ఒక రూపాయి అభివృద్ధి ఏంటో చెప్పాలి.

తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే మా పథకాలు కాఫీ కొట్టి ఎందుకు అమలు చేశారు.

తెలంగాణ పేరు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఒక అవార్డు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. తెలంగాణలో అభివృద్ధి జరగకుంటే ఢిల్లీలో తెలంగాణకు అవార్డులు ఎందుకు ఇచ్చారు.

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ సంక్షేమాన్ని, అభివృద్ధిని పొగిడిన బిజెపి ప్రధానమంత్రి ఢిల్లీలో మెచ్చుకొని రాజకీయం కోసం గల్లీలో తిట్టడం ఎందుకు.

సాక్షాత్తు నరేంద్ర మోడీ పార్లమెంటులో కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చిన నీళ్ల గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి అడుగుతాడని చెప్పి ఈరోజు గల్లికి వచ్చి రాజకీయ కుట్ర పూర్తి మాటలు మాట్లాడం ఎందుకు.

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్న సంక్షేమాన్ని ఇతర రాష్ట్ర మేనిఫెస్టోలలో పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.

తెలంగాణ ఆచరిస్తది దేశం అనుసరిస్తది అన్న విధంగా మారింది.

సీట్లు కావాలంటే ఢిల్లీకే పోవాలి. పదవులు కావాలంటే ఢిల్లీకి పోవాలి. ఆఖరికి ఓట్లు కావాలంటే కూడా ఢిల్లీ నుంచి నాయకులు రావాల్సిన పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ బిజెపి పార్టీలది.

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే రాజ్ నాథ్ సింగ్ నవ్వుల పాలవడం తప్ప ఏమీ కాదు.

రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం దాన్ని ప్రజలకు పంచడం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మనస్తత్వం. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలను కూడా పెంచి అందిస్తున్నారు.

కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రోజుకు ఒక స్కాంతో కుదేలవుతుంది.

ఒకసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది కానీ 11 సార్లు అవకాశం ఇచ్చిన ఏం చేయని పరిస్థితి. 9 సంవత్సరాలలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చూసి ప్రజలు కేసీఆర్ గారిని గెలిపించుకోవాలని చూస్తున్నారు.

మూడోసారి మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.

సిద్దిపేట కలను నిజం చేసిన నాయకుడు సిద్దిపేట ముద్దుబిడ్డ కేసీఆర్ గారు సిద్దిపేటకు వస్తున్న నేపథ్యంలో వారి సభను విజయవంతం చేయాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News