Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Manchiryala a sensitive constituency: మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక నిఘా

Manchiryala a sensitive constituency: మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక నిఘా

వ్యయ సున్నిత నియోజకవర్గంగా ..

గత ఎన్నికల దృష్ట్యా రాబోవు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో భాగంగా వ్యయ సున్నిత నియోజకవర్గంగా గుర్తించబడిన మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశంలో 003-బెల్లంపల్లి (ఎస్సి.) ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి.రాహుల్, జిల్లా ఉప ఎన్నికల అధికారి, జిల్లా అదనపు పాలనాధికారి (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, మంచిర్యాల డిసిపి సుధీర్ రామ్నాథ్ కేకన్, 002-చెన్నూర్ (ఎస్సి) ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ప్రత్యేక ఉప పాలనాధికారి (ఎల్.ఎ., ఆర్&ఆర్) సిడాం దత్తు, 004-మంచిర్యాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజస్వ మండల అధికారి వి. రాములు, జిల్లా ఆబ్కారీ, మద్యనిషేధ శాఖ అధికారి కె.జి. నందగోపాల్, కమర్షియల్ టాక్స్ అధికారి సిహెచ్. శివప్రసాద్లతో కలిసి ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ 2018 అసెంబ్లీ ఎన్నికలలో 004 – మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన తనిఖీలలో 2 కోట్ల 57 లక్షల 83 వేల 732 రూపాయల నగదు, 3 లక్షల 62 వేల 933 రూపాయల విలువ గల 846 లీటర్ల మద్యం, 30 లక్షల రూపాయల విలువ గల 1 కిలో బంగారం, 11 లక్షల 25 వేల 300 రూపాయల విలువ గల 148 బ్లాంకెట్లు, 6 వేల 307 చీరలను స్వాధీన పర్చుకోవడం జరిగిందని, ఈ క్రమంలో రాబోవు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాలో అత్యంత వ్యయ సున్నిత నియోజకవర్గంగా గుర్తించడం జరిగిందని తెలిపారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికల నియమావళికి లోబడి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా రాబోవు ఎన్నికలలో జిల్లా వ్యాప్తంగా చెకోపోస్టులు, ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలు, వీడియో సర్వేయలెన్స్ బృందాలు, ఖర్చుల పరిశీలన బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News