Monday, July 8, 2024
Homeపాలిటిక్స్Srisailam TDP: అన్నా.. నేనొస్తా..

Srisailam TDP: అన్నా.. నేనొస్తా..

శ్రీశైలం టిడిపిలోకి భారీ చేరికలకు రంగం సిద్దం

శ్రీశైలం నియోజకవర్గంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అధికార పార్టీ నాయకులు, సామాజిక వేత్తలు ఉత్సాహం చూపుతున్నారు. ముందు చేరితే పార్టీలో సీనియారిటీ పెరుగుతుందని ఆశిస్తూ… ఇంఛార్జి అనుమతి కోసం ఎదురు. చూస్తున్నారు. అన్నా నేనోస్తా నంటూ.. కళ్ళకు గంతలు కట్టుకుని పసుపు కండువా కప్పు కునేందుకు తహతహలాడుతున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ నెరవేర్చకపోవడం పట్ల ప్రజలలో పాటు, పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఎన్నికల ముందు అన్నింటికీ సొంత నిధులు వెచ్చించి పూర్తి చేస్తాను అని చెప్పిన ఎమ్మెల్యే శిల్పా, నేడు ప్రభుత్వం నిధులు లేవు అంటూ సాకులు చెప్పడం పట్ల పలు సామాజిక వర్గాలు తీవ్ర అసంతృప్తులు లోనైనట్లు తెలుస్తోంది. వైసిపి ఓటు బ్యాంక్ గా ఉన్న దళిత, మైనార్టీ వర్గాలు వైసిపికి దూరమైయ్యాయనే వాదన బలంగా వినిపిస్తోంది, ఇందుకు కారణం గత ఎన్నికల ముందు అనేక గ్రామాల్లో దళిత కాలనీలలో చర్చిలు కట్టి తాళాలు చేతికి అందిస్తానంటూ హామీలు ఇవ్వడం, వాటిని నెరవేర్చకపోవడం పట్ల దళితులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మైనార్టీ వర్గాలకు గత తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తే నేడు వైసిపి ప్రభుత్వం వాటిని రద్దు చేయడమే కాక, ఆత్మకూరు, వెలుగోడు, మహానంది మండలాల్లో టిడిపి ప్రభుత్వం మంజూరు చేయించి నిర్మాణాలు ప్రారంభించిన షాదీఖానాలను నిధుల లేమితో మూలకు వెయ్యడం పట్ల మైనార్టీలు ఆగ్రహంగా ఉన్నారు.

- Advertisement -

మాట ఇస్తే తప్పడు, తప్పుడు హామీలు ఇవ్వడు అని శ్రీశైలం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పై నియోజకవర్గ ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పడింది. గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీ లను నెరవేర్చడంతో ప్రజల్లో, నాయకుల్లో ఆయనపై పూర్తి విశ్వాసం కలిగింది. దీనితో తెలుగుదేశం పార్టీ లో చేరేందుకు రాజకీయ నాయకులే కాకా, రాజకీయాలకు సంబంధం లేని ఆశవాహులు సైతం ఉత్సాహం చూపుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే, యువత కు మెరుగైన ఉజ్వల భవిష్యత్తు కోసం విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు సారథ్యం లో తెలుగుదేశం పార్టీ నే సరైన వేదిక అని భావిస్తున్నట్లు సమాచారం. శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధికి తపించేది బుడ్డా కుటుంబం మాత్రమే నని ప్రజలు చర్చించుకుంటున్నారు, శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి, సున్నిపెంట ఇళ్ళ పట్టాలు పంపిణీ, ఆత్మకూరు త్రాగునీటి పథకం మంజూరు, సిద్దాపురం ఎత్తిపోతల పథకం పూర్తి, నీరు చెట్టు పథకం క్రింద ఆయకట్టు రోడ్లు, తెలుగు గంగ లైనింగ్ పనులు, షాదిఖానా లు, ట్రాక్టర్ల పంపిణీ, సుమారు రూ.22 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ కార్పొరేషన్ ల ద్వారా లక్షల్లో రుణాల మంజూరు అయ్యాయి అంటే అప్పటి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కృషి ఎంతైనా ఉందని ప్రజలు భావిస్తున్నారు.

కాంగ్రెస్ గడ్డగా వెలుగు వెలిగిన పూర్వపు ఆత్మకూరు నియోజకవర్గం, కాంగ్రెస్ పతనానంతరం వైసిపి కంచు కోటగా మారింది, ఎప్పుడు పసుపు జెండా ప్రభంజానానికి వైసిపి కోటలు బద్దలు అవుతున్నాయి, చాపకింద నీరులా తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుంది. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కి దూరంగా ఉన్న వర్గాలు సైతం పసుపు కండువా కప్పు కునేందుకు తహతహలాడుతున్నారు. అన్న హామీ కావాలి అంటూ తమ కోరికలను వెల్లడిస్తూనే తమ రాజకీయ భవిష్యత్తును కపడుకునేందుకు పార్టీ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ మేరకు ఓటు బ్యాంక్ కలిగిన పలువురు నాయకులు, కొత్త వారి చేరికకు మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారం పది రోజుల్లో భారీ స్థాయి ఏర్పాట్లతో చేరికకు సిద్ధం అయినట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఎది ఏమైనా శ్రీశైలం నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం జెండా ఎమ్మెల్యే స్థానంపై ఎగరడం గ్యారెంటీ అని చెప్పడంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News