Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Sunke Ravi: కుల వృత్తులు ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే

Sunke Ravi: కుల వృత్తులు ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే

బీసీ బంధు అందుకేనన్న ఎమ్మెల్యే

చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, మల్యాల, కొడిమ్యాల మండలాలకు సంబంధించిన బిసి బంధు లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఎమ్మెల్యే మాట్లాడుతూ చావు నోట్లో తల పెట్టి – బరి గీసి నిలబడి కెసీఆర్ రాష్ట్రాన్ని సాధించారన్నారు. కుల వృత్తులు అంతరించి పోకుండా కెసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కెసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్ళలో ఎన్నో అద్భుతాలు సృష్టించిందన్నారు.
కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, రజక , నాయి బ్రాహ్మణ , విశ్వ బ్రాహ్మణ కుల వృత్తుల ఎదుగుదలకు 1లక్ష రూపాయల బిసి బంధు తోడ్పడుతుందన్నారు.
గత పాలకులు చేతిలో కుల వృత్తులు మట్టిలో కలిసిపోయాయన్నారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి లో దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగిందన్నారు. రైతును రాజుగా చేస్తున్న రైతు బంధావుడు కెసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News