రానున్న శాసనసభ ఎన్నికల్లో లోకల్ లీడర్లకే అధిష్టానం పోటీ చేసే అవకాశం స్థానిక నాయకుడైన వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు అమీర్ అబ్దుల్లా కు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోరారు. శాసనసభ ఎలక్షన్ లో స్థానిక నేతలకే టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో జిల్లా ఉపాధ్యక్షులు అమీర్ అబ్దుల్లా ఉన్నారని అధిష్టానం కేటాయిస్తే బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని తాండూరు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు. స్థానికులకు ఎవరికి టికెట్ ఇచ్చినా స్థానిక నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా అమీర్ అబ్దుల్ తండ్రి అబ్దుల్ ఆహాద్ పట్టణంలోని పాత తాండూరు నుండి కౌన్సిలర్ గా పోటీ చేశారు. గత ఎన్నికల్లో తాండూరులో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన రోహిత్ రెడ్డికి మద్దతు పలికి మెజారిటీ ఓట్లతో గెలిపించామన్నారు. గెలుపొందిన తరువాత రోహిత్ రెడ్డి పార్టీని వీడారు. అదేవిధంగా ప్రస్తుతం నాన్ లోకల్ నాయకులు వచ్చి గెలుపొంది పార్టి మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి లోకల్ నాయకులకు టికెట్ ఇవ్వాలి అని కాంగ్రెస్ నాయకులు కోరారు. అమీర్ కుటుంబ సభ్యులు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తు వారి కష్ట నష్టాలలో పాలు పంచుకుంటున్న స్థానికులకే కాకుండా పారాషూట్ సూటికేసులు పట్టుకొని వచ్చే వారికి టికెట్ ఇస్తే మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
Tandur Congress: నాన్ లోకల్ కు టికెటిస్తే ఊరుకోం
లోకల్ లీడర్ కే టికెట్ ఇవ్వండి