Monday, July 8, 2024
Homeపాలిటిక్స్Tandur: వచ్చే ఎన్నికలో పైలెట్ ఎమ్మెల్యేగా గెలుపు "డౌటే" ?

Tandur: వచ్చే ఎన్నికలో పైలెట్ ఎమ్మెల్యేగా గెలుపు “డౌటే” ?

పైలెట్ కు చిక్కులు మొదలు?

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో ఎక్కడ లేని హై టెన్షన్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నెలకొంది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అంటే తెలియని వారు లేరు అని చెప్పుకోవచ్చు. అది ఎలా అంటారా.. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం, ఈడి కేసులో చిక్కుకుని ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. ఇకపోతే ప్రస్తుత రాజకీయాల్లో జోరుమీదున్న పైలెట్ రోహిత్ రెడ్డికి చిక్కులు మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చు. తాండూరు ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి vs ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య పోరు కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఎమ్మెల్యే టికెట్ కోసం అటు రోహిత్ రెడ్డి, ఇటు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నానాపాట్లు పడ్డారు. ఇప్పడు తాండూరు ఎమ్మెల్యే టికెట్ రోహిత్ రెడ్డికే కన్ఫర్మ్ అని వార్తలు వస్తున్నాయి. కానీ స్థానిక ప్రజలు మాత్రం వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్ మీద ఉన్న ఆసక్తి తాండూరు అభివృద్ధి చేసేందుకు లేదని విమర్శించారు. ఎమ్మెల్యే టికెట్ రోహిత్ రెడ్డికి వచ్చిన గెలుపు కష్టం అని స్థానికలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, ఒక్కసారి నమ్మి తాండూరుని అభివృద్ధి చేస్తాడు అని నమ్మి ఓట్లు వేస్తే గెలుపొందిన తర్వాత తాండూరు అభివృద్ధి రూపురేఖలు మారుస్తా అని తెరాస పార్టీలోకి చేరారు. తెరాస పార్టీలోకి చేరినక కూడా చేసింది ఏమీలేదు అని స్థానిక ప్రజలు విమర్శించారు. రోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధి అంటే కొన్ని గ్రామాల్లో జరుగుతుందని చెప్పుకోవచ్చు కానీ అభివృద్ధి కన్నా తాండూరులో ఎమ్మెల్యే అండతో దో నంబర్ దందాలు ఎక్కువ కొనసాగుతోంది అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే టికెట్ కోసం మీ పాట్లు మీరు పడండి… చివరికి ఎవరికి ఓటు వేసి గెలిపించుకోవలో మాకు తెలుసు. మీ గెలుపు మా చేతులో ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. స్థానిక ప్రజలు ఈసారి తాండూరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారో వేచిచూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News