తెలంగాణ రాష్ట్రంలో హై టెన్షన్ రాజకీయాలు ఎక్కడ అంటే వికారాబాద్ జిల్లా తాండూరు అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ తరఫున తాండూర్ ఎమ్మెల్యే టికెట్ నాకే కన్ఫర్మ్ అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
కానీ ఇప్పుడు తాండూరు కాంగ్రెస్ పార్టీలో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవలే తాండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ హాజరుకావడంతో తాండూరు కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నెలకొందని అంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తాండూర్ ఎమ్మెల్యే టికెట్ పై కొంతవరకు చర్చలు జరుపుకొని తాండూరులో బిజెపి, బిఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలంటే సరైన దమ్మున్న నాయకుడు కేఎల్ఆర్ అని వారు చర్చించుకున్నట్లు సమాచారం.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పైలట్ రోహిత్ రెడ్డి గెలుపొంది కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మధ్య నువ్వా నేనా అనే వర్గ పోరు తాండూరులో హీటెక్కిచ్చాయి. వీరి వర్గపోరుతో తాండూర్ లో బిఆర్ఎస్ పార్టీ ఓటమిపాలవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పైలెట్ రోహిత్ రెడ్డికి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీలో కొంతవరకు వర్గ పోరు సద్దుమణిగి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు సన్నాహాలు జరుపుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేఎల్ఆర్ కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలుపొందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం రఘువీర్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ సంపత్ కుమార్ , శ్రీనివాస్ రెడ్డిలు ఎవరికి వాళ్లు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్, బీజేపీని పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ అధిష్టానం కేఎల్ఆర్ కు టికెట్ కచ్చితంగా ఇవ్వాల్సిందే అని స్థానిక కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.