వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీలో అసలు ఏం జరుగుతుందనే ఉత్కంఠ తాండూరు రేకేతిస్తోంది. మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న సర్వసభ్య సాధారణ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడం, ప్రతిపక్ష కౌన్సిలర్లకు ప్రశ్నించే హక్కును కల్పించక పోవడం.. ఒకవేళ ప్రశ్నిస్తే పోలీసులతో అదుపులో తీసుకుంటుండటం అంతా గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్నదంతా తాండూరు మున్సిపాలిటీకి సిగ్గుచేటని స్థానికులు చర్చించుకుంటున్నారు. బుధవారం నిర్వహిస్తున్న మున్సిపాలిటీ సమావేశానికి 10 మంది పోలీసులతో బందోబస్తు ఎందుకు నిర్వహిస్తున్నారని, తాండూరు మున్సిపాలిటీలో చర్చించనున్న అంశాలను ఎందుకు బయట పెట్టడం లేదని.. లోలోపల ఇష్టానుసారంగా ఎజెండా అంశాలను తయారుచేసి తాండూరు మున్సిపాలిటీని భ్రష్టు పట్టిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గ పోరుతో తాండూరు అభివృద్ధి పక్కన పెట్టేసి కేవలం ఫోటోలకు పోజు ఇవ్వటానికే తాండూరు మున్సిపాలిటీ పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాఅధికార పక్షం నాయకులు మాత్రం దీన్ని ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. అసలు ఈరోజు సమావేశం జరుగుతుందా లేదా….? అభివృద్ధి కార్యక్రమాలపై సంయుక్త సమావేశం నిర్వహించి చర్చించుకుంటున్నారా లేదా అన్న విషయంపై స్పష్టత ఇంకా రావాల్సి ఉంది.