Sub-Sarpanch election
వైయస్ఆర్ కడప జిల్లా గోపవరం ఉప సర్పంచ్( Sub-Sarpanch election) ఎన్నిక విషయంలో ప్రొద్దుటూరులో టెన్షన్ వాతవరణం నెలకొంది. ప్రొద్దుటూరులో వైసీపీ, టిడిపి నేతలను ముందుగానే హౌస్ అరెస్టులు చేశారు పోలీసులు.
గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా పోలీసుల చర్యలు
రెండవ రోజు ఉపసర్పంచ్ ఎన్నిక సజావుగా జరిగేందుకే చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా గురువారం చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో మూడంచల భద్రత ఏర్పాటు చేశారు.
గోపవరం పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు
తమ వద్ద 13 మంది వార్డు మెంబర్లు ఉన్నారని వైసీపీ తెలిపింది. ఉప సర్పంచ్ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాఘవరెడ్డి ఉన్నారు. వైసీపీని విభేదించి టిడిపిలో ఐదు మంది వార్డు మెంబర్లు చేరారు.
ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు మెంబర్ పవన్ టిడిపి వైపు వెళ్లడంతో టిడిపి బలం ఏడుకు చేరుకుంది. మరి అధికార టిడిపి పార్టీ ఎలా వ్యవహరిస్తుందోనని ప్రొద్దుటూరులో ఉత్కంఠ నెలకొంది. ఈ రోజైనా ఉపసర్పంచ్ ఎన్నిక జరుగుతుందా లేదా అని టెన్షన్ టెన్షన్ గా ఉంది.