Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Thikkareddy: రైతులకు న్యాయం జరిగేంత తెలుగుదేశం పోరాటం

Thikkareddy: రైతులకు న్యాయం జరిగేంత తెలుగుదేశం పోరాటం

వంట వార్పు చేస్తూ నిరసన

రైతులకు సాగునీటి సక్రమంగా అందించడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులకు న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పోరాటం ఆగదని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. కౌతాళం మండలం కామవరం గ్రామం దగ్గర ఉన్న ఎల్ ఎల్ సి హెడ్ రెగ్యులేటర్ దగ్గర తుంగభద్ర దిగువ కాలువను పరిశీలించారు.. అనంతరం రైతులతో కలిసి వంట వార్పు కార్యక్రమం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు… వైసిపి నేతలు మాయ మాటలు చెప్పడం మాని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.. నిరసన కార్యక్రమానికి భారీ ఎత్తున రైతులు చేరుకోని తాము సాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులు అన్ని తిక్క రెడ్డికి తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే వైసిపి ప్రభుత్వం గానీ స్థానిక ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి కాని చీమ కుట్టినట్లు కూడా లేదు అని రానున్న రోజుల్లో రైతులకు న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని, ఎండిపోయిన పంటలకు తక్షణమే నష్టపరిహారం అందజేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

తుంగభద్ర దిగువ కాలువ పరిధిలోని రైతులకు సక్రమంగా సాగునీరు అందకపోవడంతో, కళ్ళెదుటే పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం స్పందించి వెంటనే సాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు… ఒకవైపు సాగునీటి కొరత, ఇంకోవైపు కరెంటు కోతలతో రైతుల పరిస్థితి అగమగుచరంగా తయారైంది అన్నారు… గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల అనేక కష్టాలకు గురి అవుతున్న పాలకులు మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు… ప్రభుత్వం వెంటనే కర్నూలు జిల్లాలో కరువు జిల్లాగా ప్రభుత్వం వెంటనే కర్నూలు జిల్లాలో కరువు జిల్లాగా ప్రకటించి కరువు సహాయక చర్యలను చేపట్టాలన్నారు..

రైతులకు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు… రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటాలు చేస్తామని ఆయన తెలిపారు… ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చేన్నబసప్ప , తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి కోట్రేష్ ష్ గౌడ్, దూదేకుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సాయిబాబా, కోసిగి మండల కన్వీనర్ జ్ఞానేష్, కాశీ విశ్వనాథ్ , బాపురం వెంకటరెడ్డి, రమేష్ గౌడ్, మైనార్టీ నియోజకవర్గం అధ్యక్షులు టిప్పు సుల్తాన్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి రాజాబాబు, ఉమేష్ గౌడ్, రంగస్వామి ,నబిసాబ్, చిన్న బొంపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News