ఖమ్మంలో అప్పుడే పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. పలువురు సీనియర్లు, వారి సంతానం ఎంపీలుగా బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుని, ప్రచారాన్ని పరోక్షంగా సాగిస్తున్నారు. ఈనేపథ్యంలో ఖమ్మంలో ఎంపీలుగా ఆరు సార్లు విజేతలుగా కమ్మ సామాజిక వర్గం నిలిచిన విషయాన్ని అందరూ గుర్తుచేసుకుంటున్నారు. తమ్మినేని….నాదెండ్ల…..రేణుకా చౌదరి….నామా గెలుపు
1999…2004 లో రేణుకా చౌదరి…..2009….2019 లో నామా గెలుపు.
తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాల్లో కమ్మ జాతికి అవకాశం ఉన్న ఖమ్మ సామాజిక సమీకరణాల్లో ఖమ్మం కమ్మవారికే కెటాయించే అవకాశాలు స్ఫష్టం. టీడీపీ, టీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ లో చక్రం తిప్పుతున్న సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు కుమారుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ ప్రజాక్షేత్రంలోకి దూసుకుకెళుతున్నారు.
ఖమ్మం గుమ్మంలో రాజకీయ ప్రస్థానం కోసం అడుగులు వేస్తున్నారు డాక్టర్ తుమ్మల యుగంధర్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తనయుడే డాక్టర్ యుగంధర్ .ఇన్నాళ్లు తండ్రి రాజకీయాలను నిశితంగా గమనిస్తూ తెరవెనుక వ్యూహాలు చేసే డాక్టర్ యుగంధర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి రాజకీయ వ్యవహారాలను నడిపించి సక్సెస్ అయిన యుగంధర్ పై సన్నిహితులు మిత్రులు ఒత్తిళ్లతో ఖమ్మం ఎంపీ గా కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉండాలని ప్రజా క్షేత్రంలోకి దూకుడుగా వెళుతున్నారు. డాక్టర్ యుగంధర్ ఎంపీగా బరిలో ఉంటే రాజకీయ సమీకణాలు ఎలా ఉంటాయి?….తండ్రి తుమ్మల నాగేశ్వర్ రావు రాజకీయ అనుభవం ఎలా విజయానికి దారులు వేయనుంది.? వారసుడిగా కాకుండా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఖమ్మం రాజకీయ కురుక్షేత్రంలో సమరశంఖం పూరిస్తున్న డాక్టర్ తుమ్మల యుగంధర్ రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
డాక్టర్ తుమ్మల యుగంధర్….ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతగా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తనదైన ముద్ర వేసిన ది లీడర్ తుమ్మల నాగేశ్వర్ రావు గారి కుమారుడే యుగంధర్.చిన్నతనం నుంచి తండ్రి రాజకీయ వ్యవహారాలు ఆటుపోట్లు అన్ని కళ్లారా చూస్తూ పెరిగిన యుగంధర్ ఏనాడు రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉండక పోవడానికి కారణం తండ్రి గీసిన గీత. సహజంగా తండ్రి మంత్రిగా ఉంటే చాలా మంది కుమారులను చూసాం అధికార దుర్వినియోగం చేసిన ఘటనలు. అలాంటి అపవాదు రాకూడదని తుమ్మల. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు 17 ఏళ్లు మంత్రిగా ఉన్నా ఏనాడు యుగంధర్ అధికార పైరవీల్లో వేలు పెట్టలేదు ఎలాంటి ఆరోపణలు రాకూడదని తుమ్మల ఇన్నాళ్లు యుగంధర్ ని ప్రత్యక్ష రాజకీయాలకు దూరం పెట్టారు..అసెంబ్లీ ఎన్నికల్లో సారధిగా డాక్టర్ యుగంధర్ తండ్రి విజయంలో వ్యూహాకర్తగా యుగంధర్ గత నెల నవంబర్ 30 న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వర్ రావు బరిలో ఉండగా తుమ్మల ఎన్నికల ప్రచారం కే పరిమితం చేస్తూ ఆయనకు ఆరోగ్యపరంగా ఒత్తిళ్లు లేకుండా.. పోల్ మేనేజ్ మెంట్ వ్యవహారాలు బూత్ స్థాయి యాక్టివిటీస్ ప్రచార కార్యక్రమాలు ఇలా ప్రతి అంశంలో యుగంధర్ అన్ని బాద్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. తండ్రి తుమ్మలకి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఓ పక్క ప్రత్యర్ది కవ్వింపు రాజకీయాలు ప్రలోభ రాజకీయాలు.. పోలీస్ అక్రమ కేసులతో బెదిరింపు రాజకీయాలు చేస్తుంటే కార్యకర్తలు నేతలకు అండగా ముందుండి తన ధైర్యం ఏంటో తన తెగువ ఏంటే యుగంధర్ శాంపిల్ గా చూపించారు..అసెంబ్లీ ఎన్నికల్లో యుగంధర్ వ్యూహా రచన పోల్ మేనేజ్ మెంట్ వ్యవహారాలు చూసిన తండ్రి తుమ్మల గారు సైతం ఆశ్చర్య పోయారని ఆయన సన్నిహితులు అంటున్న మాట.అనవసరంగా రాజకీయ విమర్శలు వస్తాయని ఇన్నాళ్లు యుగంధర్ ని దూరంగా ఉంచా కానీ ప్రజాసేవ చేయాలనే తపన తనలో కనిపిస్తుంది….నాకు నేను చెప్పకపోయినా యుగంధర్ సంకల్పానికి ఇక అడ్డు తగలను రాజకీయాల్లో యువశక్తి రావాలంటే అవకాశాలు ఇవ్వాలి అతని ప్రయత్నాలు అతను చేసుకోనివ్వండి పార్టీ అధిష్టానం గుర్తించే రోజు అతని అవకాశం ఆపలేం కదా అని తుమ్మల సన్నిహితులతో అన్న మాటలు.
ఖమ్మం పార్లమెంట్ స్థానంలో కలిసొచ్చే సామాజిక సమీకరణాలు
తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ లోకసభ స్థానాలుంటే హైదరాబాద్ లో మైనార్టీలు.. నల్గోండ లో రెడ్లు మహబూబ్ నగర్ లో రెడ్లు ఎలాగో ఖమ్మం లో కమ్మ సామాజిక వర్గానికి కంచుకోట గా ఉంది.ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి 1996 లో తమ్మినేని 1998 లో నాదెండ్ల భాస్కర్ రావు 1999 లో రేణుకా చౌదరి 2004 లో రేణుకా చౌదరి 2009 లో 2019 లో రెండు సార్లు నామా నాగేశ్వర్ రావు ఎంపీ గా విజయం సాధించారు.ఇప్పటి వరకు 6 దఫాలు ఎంపీ లుగా కమ్మ సామాజిక వర్గం వారు విజేత గా నిలిచారు.ఖమ్మం పార్లమెంట్ పరిధిలో రెండున్నర లక్షల వరకు కమ్మ సామాజిక ఓటర్లు ఉన్నారు.ఇంత పెద్ద ఎత్తున కమ్మ వారు ఉన్న పార్లమెంట్ స్థానం ఎక్కడా లేదు.దాంతో ఖమ్మం అంటే ఏ పార్టీ ఐనా సోషల్ ఇంజనీరింగ్ లెక్కల్లో కమ్మ వారికి పెద్దపీట వేస్తారు.దాంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ తుమ్మల యుగంధర్ కి క్యాస్ట్ ఈక్వేషన్ కలిసోచ్చే అంశం.ఖమ్మం పార్లమెంట్ స్థానం లో పోటీకి పలువురు పోటీకి సిద్దమవుతున్నా ఎవ్వరి ప్రయత్నాలు వారివి. కానీ వాస్తవ అంశాలు గణాంకాలు గత ఎన్నికల చరిత్ర ఇవన్నీ చూస్తే ఖమ్మం ఎంపీ గా ఏ పార్టీ ఐనా కమ్మకి అవకాశం ఇచ్చే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో ఉండేందుకు డాక్టర్ తుమ్మల యుగంధర్ ప్రజా క్షేత్రంలో దూసుకెళుతున్నారు.
యూత్ ఐకాన్ గా డాక్టర్ యుగంధర్..కాంగ్రెస్ పార్టీ ..యవకుడు డాక్టర్ గా ఉన్న యుగంధర్ కు ఎంపీ గా బరిలో అవకాశం ఇస్తే ..యుగంధర్ లాంటి వారు పార్లమెంట్ లో అడుగు పెడితే ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పారిశ్రామిక అభివ్రుద్ది ఎలా చేయాలో మాస్టర్ ప్లాన్ తో తుమ్మల యుగంధర్ సిద్దంగా ఉన్నారు. అగ్రి ఎంటర్ ప్రెన్యూర్ షిప్ రంగంలో …..హార్టీ కల్చర్ రంగంలో…..మైన్స్ డిపార్ట్ మెంట్ లో…..కొత్త పరిశ్రమల స్థాపన తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలకు దారులు వేయడం.సింగరేణి తరువాత అత్యధిక మందికి ఉపాదిగా మారిన గ్రానైట్ ఇండస్ట్రీ లో కొత్త అవకాశాలు బయో ఎనర్జీ…బయో మెడికల్ రంగాల్లో జిల్లాలో ఉన్న వనరులపై ఫీల్డ్ స్టడీ చేసిన యుగంధర్ విజన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యువత నిరుద్యోగులకు వరంగా మారే అవకాశం ఉంది.యుగంధర్ లాంటి యువ నాయకులు అర్హత ఉన్న కాంగ్రెస్ అధిష్టానం గుర్తిస్తుందని..తండ్రి కి తగ్గ తనయుడుగా రాజకీయాల్లో నిరూపించుకోవడానికి ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల కురుక్షేత్రంలో రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నారు డాక్టర్ తుమ్మల యుగంధర్…