Tummala Hot Comments: రైతు సమస్యలు, పంట నష్టం, యూరియా కొరతపై బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. కాగా.. ఈ ధర్నాపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విమర్శలు గుప్పించారు. యూరియాపై బీఆర్‌ఎస్ నేతలది కపట నాటకమని ధ్వజమెత్తారు. యూరియా కొరతకు కేంద్రం కారణమని తెలియదా అని బీఆర్ఎస్ ని విమర్శించారు. కేంద్రం వల్ల కొరత ఉంటే కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తారా అని నిప్పులు చెరిగారు. అధికారం లేదనే అక్కసుతో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
Read Also: Karnataka: కర్ణాటకలో మూడేళ్లలో 80 వేలకు పైగా టీనేజ్ ప్రెగ్నెన్సీలు
బీఆర్ఎస్ ధర్నా..
మరోవైపు, రైతు సమస్యలు, పంటనష్టంపై వ్యవసాయ శాఖ కమిషనర్‌కు భారత రాష్ట్ర సమితి నేతలు వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని బైఠాయించారు. దీంతో కేటీఆర్, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్సీలు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఏ రాష్ట్రాల్లోనూ యూరియా సమస్య లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే.. తెలంగాణలో కొరత ఏర్పడిందని చెప్పారు. గత ప్రభుత్వంలో కరోనా సమయంలోనూ ఇబ్బంది లేకుండా పంపిణీ చేసినట్లు వివరించారు. భాజపా, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు నెపం వేసుకొని తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. యూరియా పంపిణీ చేతకాకపోతే తప్పుకోవాలన్నారు. తాము రాజకీయాల కోసం రాలేదని.. రైతుల కోసం వచ్చినట్లు పేర్కొన్నారు. యూరియా కోసం వెళ్తే రైతులపై దాడి చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కొరత సమస్యపై ఒక్కరోజైనా సమీక్ష చేశారా అని ప్రశ్నించారు.
Read Also: Niharika: చీరతో కుర్రాలను కట్టిపడేస్తున్న మెగాడాటర్ నిహారిక!


