MLC Kavitha Vs Komatireddy : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఛార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకులు భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి, కవిత మధ్య ట్వీట్ల వార్ మొదలైంది. లిక్కర్ క్వీన్ అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేయడంతో మొదలైన ఈ ట్వీట్ల వార్ పతాక స్థాయికి చేరింది.
ఓ పత్రికలో వచ్చిన క్లిప్‌ను షేర్ చేస్తూ లిక్కర్ క్లీన్ పేరు ఛార్జిషీటులో 28 సార్లు ప్రసావించారు అంటూ తొలుత రాజగోపాల్ రెడ్డి కవితను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ ‘రాజగోపాల్ అన్న తొందర పడకు, మాట జారకు.. 28 సార్లు నా పేరు చెప్పించినా.. 28 వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు. ట్రూత్ విల్ ప్రివెయిల్’ అంటూ కవిత కౌంటర్ ఇచ్చారు..
కవిత ట్వీట్‌కు రాజగోపాల్ రెడ్డి అంతకంటే స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చారు. ‘నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పారదర్శకరంగా టెండర్ ద్వారా వచ్చిన 18000 కోట్ల విషయంలో నా పై విష ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు రాబోయే రోజుల్లో అవినీతి మయమైన మీ కుటుంబం అంతా జైలు కి వెళ్లడం ఖాయం’ అంటూ సమాధానం ఇచ్చారు.