Tuesday, March 25, 2025
Homeపాలిటిక్స్YCP: పులివెందులలో వైసీపీకి ఊహించని షాక్‌

YCP: పులివెందులలో వైసీపీకి ఊహించని షాక్‌

పులివెందుల అంటే సంధింటికి దుర్భేధ్యమైన కోట అని అనుకునే రోజులు ఇక గత చరిత్ర కానుంది. ప్రజల్లో జగన్ పట్ల పెరుగుతున్న అసంతృప్తి, టీడీపీ(TDP) పట్ల వారిలో కలిగిన నమ్మకం ఇప్పుడు పులివెందులలో స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు ముందు వైసీపీ(YCP) క్యాడర్ గుంపులుగా టీడీపీలో చేరడం వైసీపీకి ఊహించని షాక్‌గా మారింది.

- Advertisement -

సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గుడురులో బీటెక్ రవికి ఘన స్వాగతం లభించింది. ఆయన ప్రత్యేకంగా అంకాలమ్మ తల్లి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా అంకాలమ్మ గుడురుకు చెందిన వైసీపీ నాయకుడు వెలుగోటి బాబు రెడ్డి తన అనుచరులతో సహా తెలుగుదేశం పార్టీలో చేరాడు. పులివెందుల టీడీపీ ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) సమక్షంలో వీరందరికీ టీడీపీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.

“ఇది ప్రజల ప్రభుత్వం – రాజారెడ్డి పాలన కాదు!”
పార్టీలో చేరిన వారికి “మీ సమస్యల పరిష్కారం మా బాధ్యత!” “ఎప్పుడు, ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాం!” “పులివెందులలో ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయాన్ని చూపించేది తెలుగుదేశమే! అని బీటెక్ రవి హామీ ఇచ్చారు.

మున్సిపల్ ఎన్నికలకు ముందు బయటపడిన వైసీపీ బలహీనత
పులివెందుల మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ వైసీపీలో కొందరు నేతలు అసంతృప్తితో బయటకు వస్తున్నారన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రవి చెప్పారు.

పులివెందులలో గత ఎమ్మెల్సీ ఎన్నికలలో మెజారిటీ వచ్చింది, తరువాత జగన్ మెజారిటీ తగ్గింది. టీడీపీ బలం పెరుగుతుండడం వైసీపీకి పెద్ద హెచ్చరిక అన్నారు.పులివెందులలో మార్పు ప్రారంభమైంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఈ మార్పు వైకాపాకు విస్ఫోటనం కావడం ఖాయం. కుప్పంలో పుడింగిని పెట్టి జగన్ చేసిన రాజకీయం పులివెందులలో జగనుకు ఎదురవ్వనుంది. పులివెందులలో ఈ అలజడితో.. యాలహంకాలో వున్న జగనుకు వణుకు పుట్టింది. తన అవ్వ జయమ్మ వార్డు మెంబరుగా ఓడిపోయింది. ఆ రోజులు వస్తున్నాయని గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News