Sunday, November 16, 2025
Homeపాలిటిక్స్UP: విషం కలిపిన టీ నాకొద్దు..పోలీసులపై నమ్మకం లేదన్నమాజీ సీఎం

UP: విషం కలిపిన టీ నాకొద్దు..పోలీసులపై నమ్మకం లేదన్నమాజీ సీఎం

పోలీసులపై నమ్మకం లేదని, ఒకవేళ పోలీసులు టీలో విషం కలిపి ఇస్తే..అందుకే టీ వద్దని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పేర్కొనటం సంచలనం సృష్టిస్తోంది. లక్నోలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఇదంతా జరగటం విశేషం. పోలీసులు ఆఫర్ చేసిన టీని వద్దని చెప్పారు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. లక్నో పోలీసులు చర్యలను తీవ్రంగా నిరసించిన అఖిలేష్.. పోలీసులతో వాగ్వాదానికి సైతం దిగారు. తమ పార్టీ కార్యకర్త అయిన మనీష్ జగన్ అగర్వాల్ ను అరెస్ట్ చేయటంపై ఆయన నిప్పులు చెరిగారు. “నాకు టీ వద్దు..దీనిబదులు నేను బయటి నుంచి సొంతంగా టీ తెప్పించుకుని తాగుతా..ఒకవేళ ఈ టీలో విషం కలిపి ఉంటే..నేను మిమ్మల్ని నమ్మను” అంటూ అఖిలేష్ పేర్కొనటం వైరల్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad