Thursday, January 22, 2026
Homeపాలిటిక్స్Rangeela in Cong: రాహుల్ పాదయాత్రలో హీరోయిన్ ఊర్మిళ

Rangeela in Cong: రాహుల్ పాదయాత్రలో హీరోయిన్ ఊర్మిళ

‘రంగీలా’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా మనందరికీ సుపరిచితమైన ఊర్మిళా మాతోండ్కర్ సడన్ గా రాహుల్ గాంధీ పాదయాత్రలో తళుక్కుమన్నారు. భారత్ జోడో యాత్ర జమ్ములో సాగుతుండగా ఊర్మిళ వచ్చి రాహుల్ తో పాటు నడిచారు.

- Advertisement -

కాంగ్రెస్ లో అంతర్గత కలహాలతో తల బొప్పి కట్టిందని సరిగ్గా మూడేళ్ల క్రితం ఆమె కాంగ్రెస్ వీడి శివసేనలో చేరారు. 2019లో ముంబై నార్త్ నుంచి లోక్ సభ బరిలో దిగిన ఆమె 4.6 లక్షల ఓట్లతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. నగ్రోటాలో వణికించే చలిలో ఆమె హుషారుగా కనిపిస్తూ.. “జోడో జోడో భారత్ జోడో” అంటూ నినాదాలు ఇస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు.

తమిళ్, తెలుగు, మరాఠీ, హిందీ సినిమాల్లో దశాబ్దానికి పైగా యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ చేసిన ఈమెకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News