Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Vodithala Pranav: అధికారం మాదే, మాట తప్పం

Vodithala Pranav: అధికారం మాదే, మాట తప్పం

మార్పు తెస్తాం, మాతోనే అది సాధ్యం

మాట తప్పం మడమ తిప్పం ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హస్తం హావా కొనసాగుతుందని, ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలోని ప్రతి గడప గడపకు ఆరు గ్యారెంటీలను వంద రోజులలో చేర్చే విధంగా కృషి చేస్తానని, తన గెలుపు కోసం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఒడితల ప్రణవ్ బాబు ప్రజలను కోరారు. జమ్మికుంట మండలం నగురం, నాగారం, తనుగుల గ్రామాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద ర్యాలీలో ప్రణవ్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని బిఆర్ఎస్ పార్టీ సామాన్య ప్రజల నుండి మొదలు పెడితే ఉద్యోగ ,నిరుద్యోగులను సైతం మభ్యపెడుతూ కాలం వెళ్ళదీసి చేతులు దులుపుకుందని తీవ్రంగా దుయ్యబట్టారు . కాంగ్రెస్ అంటే స్కీములు … బి ఆర్ఎస్ అంటే స్కాములు అని ఇకనైనా ప్రజలు ఆలోచించి రానున్న ఎన్నికల్లో హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా అందరు ఆశీర్వదించాలని ప్రణవ్ కోరారు.

- Advertisement -


నియంతల పాలనలో నిండా మునిగిన రైతన్నలు …
రాష్ట్రంలో నియంతల పాలన నడుస్తుందని వారి పాలనలో అన్నదాతలు నిండా మునిగారని దానికి నిదర్శనమే మానేరులో నిర్మించిన నాసిరకమైన చెక్ డ్యామ్ అని అన్నారు. రైతులకు రెండు పంటలకు సరిపడా నీటి నిల్వ కోసం నిర్మించిన చెక్ డ్యాములు మానేరులో కొంచెం వరద తాకిడికే చెల్ల చేదురైపోయి అన్నదాతకు చాలా నష్టం కలిగించాయి అని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదించినట్లయితే రైతన్నల సంక్షేమం కోసం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని దానికి తగిన ప్రణాళికలు కాంగ్రెస్ పార్టీ రూపొందించిందని ఈ సందర్భంగా గ్రామంలోని రైతులకు ప్రణవ్ తెలిపారు.


మహిళా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం …
మహిళా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మహిళలు సుభిక్షంగా ఉంటేనే ఇల్లు చక్కదిద్దుతుందని తద్వారా గ్రామం, రాష్ట్రంతో పాటు దేశం కూడా సుభిక్షంగా ఉంటుందని మహిళా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెద్దపీట వేసిందని ఈ సందర్భంగా మహిళలకు ప్రణవ్ బాబు తెలియజేశారు .కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మహిళకు నెల నెల 2500 రూపాయల అకౌంట్లో జమ చేస్తామని ,రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మహిళ ఉచిత బస్సు ప్రయాణం చేసే విధంగా అవకాశం కల్పించామని , మహిళలు అరిగోస పడకుండా ఉండడానికి 500 కే గ్యాస్ సిలిండర్ను కూడా అందించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు . మహిళలు ఆనందంగా ఉంటే అన్ని రంగాలలో ముందుకు వెళ్తారని మహిళామూర్తులంతా ఏకమై మీ బిడ్డ లాంటి నన్ను ఆశీర్వదించాలని మహిళా మణులను కోరారు .నియోజకవర్గంలోని యువతకు ప్రతి మండలానికి ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి యువత నైపుణ్యాభివృద్ధి సాధించే విధంగా కృషి చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News