Tuesday, July 2, 2024
Homeపాలిటిక్స్Warangal: 100 రోజుల్లో 6 గ్యారెంటీ స్కీములు

Warangal: 100 రోజుల్లో 6 గ్యారెంటీ స్కీములు

వరంగల్ పశ్చిమ ఎంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డి

కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటి హామీల్లో భాగంగా మాహలక్ష్మి పథకాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ బస్టాండ్ వద్ద జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుందని అన్నారు. ఇచ్చిన మాటను నిలుపుకున్న కాంగ్రెస్ పార్టీని మహిళలు ఎప్పుడు మరవవద్దని అన్నారు. అణా పైసా ఖర్చు లేకుండా ఆర్టిసి బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ప్రయాణించడానికి వీలు కల్పించేది మహాలక్ష్మి పథకం అన్నారు. బస్ పాస్ లతో ప్రయాణించే విద్యార్థినిలకు, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగునిలకు ఈ పథకం చాలా దోహదం చేస్తోంది. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

- Advertisement -

మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని అలాగే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ స్కీమ్ లను వంద రోజులల్లో పూర్తి చేస్తామని అన్నారు. అన్నతరం ఎం.ఎల్.ఏ. నాయిని రాజేందర్ రెడ్డి మహిళా కార్యకర్తలతో బస్సులో కాజిపేట నుండి వేయి స్థంబాల గుడి వరకు ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, ఆర్టిసి ఆర్.ఎం. శ్రీలత, అధికారులు పాల్గొన్నారు.

ఆరోగ్యశ్రీ చేయూత పథకం ప్రారంభం

కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటి హామీల్లో భాగంగా ఈ రోజు హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వరంగల్ పశ్చిమ ఎంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డి ఆరోగ్య శ్రీ చేయూత పథకాన్ని ప్రారంభించారు. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రజలందరికి ప్రభుత్వమే వైద్యం అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరిస్తూ ఒకొక్క కుటుంబానికి ఏడాదికి 10 లక్షల పరిమితితో అందిస్తున్నాం అని అన్నారు.
రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పోరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షలకు పెంచింది.ఈ పథకం ఈ నెల తొమ్మిది తేది నుండి అమలులోకి వచ్చిందని అన్నారు.
ఇప్పటిదాకా ఈ పథకం కింద ఒకొక్క కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకు పరిమితి ఉండేదని, ఇప్పుడు దీన్ని రెట్టింపు చేసామని, ఇప్పుడు ఈ పథకం అన్ని ఆరోగ్య శ్రీ ఎం ప్యానల్ ఆసుపత్రుల్లో తక్షణమే అమల్లోకి వస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పిడి డిఆర్డిఏ శ్రీనివాస్ కుమార్, డీఎంహెచ్వో సాంబశివరావు, కేఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్,కార్పొరేటర్ శ్రీమాన్ రెడ్ క్రాస్ రాష్ట్ర ఈసీ మెంబెర్ ఇ.వి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో ఈ రోజు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్క్ ని మర్యాద పూర్వకంగా కలిసి భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఆర్.డి.ఓ రమేష్, కాజీపేట తహసిల్దార్ భావ్ సింగ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News