సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనేది? ఇది ఇప్పుడు సికింద్రాబాద్ కాంగ్రెస్ నేతల్లో సరికొత్త బుగులు రేగిస్తోంది. సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ్ ముందు ప్రతిపక్ష పార్టీలు నిలబడేనా అనేది మరో ఆసక్తికరమైన ప్రశ్న.
సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికీ దక్కుతుంది అని ఆ పార్టీ నాయకులలో టెన్షన్ మొదలైంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ప్రధానంగా ఆదం సంతోష్ కుమార్, నోముల ప్రకాష్ గౌడ్ మధ్య పోటా పోటీ పెరిగి, ప్రజల్లో ఆదరణ కోసం ఆరాటపడుతున్నారు. ఇరువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కింది స్థాయి కేడర్ ను తమ వైపు తిప్పుకునే పనులు చేస్తూ, గాంధీభవన్-అధిష్టానం దగ్గర మాకే ఎక్కువగా పార్టీ నాయకుల మద్దతుతో పాటు ప్రజల ఆదరణ ఉందని చెప్పుకునే పనుల్లో నిమగ్నమయ్యారు.
ఇప్పటికే సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభించి పనులు మొదలుపెట్టారు నాయకులు. కాంగ్రెస్ పార్టీ నుండి ‘లోకల్ నాయకుడు’ నేనంటే నేను అని ప్రచార జోరు కొనసాగిస్తున్నారు. వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలని కోరికతో కసిగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రధాన ప్రతిపక్షా పార్టీల నుండి వచ్చే సవాలను ఏ విధంగా ఎదుర్కోవాలనో ముందుగానే ప్లాన్ చేస్తున్న సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ పార్టీకి సికింద్రాబాద్ లో ఓటు బ్యాంకు ఉంది అని నాయకుల అంచనా. ఈ తరుణంలో సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ లో మరొక ప్రముఖ వ్యాపారవేత్త పార్టీలో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అతను కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీలోనే ముగ్గురు ప్రధాన నాయకుల మధ్య వర్గ పోరు తారాస్థాయికి పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఎవరికి దక్కుతుందని అనే టెన్షన్ నాయకుల్లో మొదలవుతుంది. ఇది ఇలా ఉండగా టిఆర్ఎస్ పార్టీ నుండి గత ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలిచి మంత్రిగా చేసి, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న పద్మారావు గౌడ్ పై గెలవడం అంత ఈజీ కాదు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుల అభిప్రాయం. వచ్చే ఎలక్షన్లలో పద్మారావు గౌడ్ పై గెలిచే సత్తా ఉన్న నాయకుడు ఎవరు అని అంతర్ పరిశీలనలో ఉంది ప్రధాన ప్రతిపక్ష పార్టీల అధిష్టాన నాయకత్వం.
సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుందో తెలియని సంక్షోభంలో సికింద్రాబాద్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళలో ప్రజల్లో వెళ్లి ప్రజల ఆదరణ పొందే మార్గం ఏది ? గెలిచేది ఎట్లా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ప్రతిపక్ష నాయకులకు. 9 ఏండ్ల నుండి సంక్షేమ పథకాలతో బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. ఈ పరిస్థితుల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో పద్మారావు గౌడ్ ను తట్టుకొని నిలబడే సత్తా ఏ పార్టీ నాయకుడికి ఉందో వేచి చూద్దాం.