Wednesday, January 8, 2025
Homeపాలిటిక్స్ఉదయం, సాయంత్రం సూర్యుడు ఎందుకు ఎర్రగా కనిపిస్తాడో తెలుసా.. కారణం ఇదే..!

ఉదయం, సాయంత్రం సూర్యుడు ఎందుకు ఎర్రగా కనిపిస్తాడో తెలుసా.. కారణం ఇదే..!

ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు చాలా అందగా కనిపిస్తాడు. అయితే ఆ సమయంలో ఎందుకు సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. దీని వెనుక కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్యోదయం, అస్తమయ సమయంలో గులాబీ, ఎరుపు రంగు సూర్యుడు మరియు దాని ఛాయలు చాలా అందమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. అయితే ఇతర సమయాల్లో పసుపు రంగులో, ప్రకాశవంతంగా కనిపించే సూర్యుడు ఉదయించినప్పుడు ఎరుపు, గులాబీ రంగులో ఎందుకు కనిపిస్తాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.

- Advertisement -

సాధారణంగా మనం సూర్యుడిని నేరుగా చూడలేం.. అయితే అస్తమిస్తున్నప్పుడు లేదా ఉదయిస్తున్నప్పుడు మాత్రమే మనం సూర్యుడిని నేరుగా చూడగలం. నిజానికి దీని వెనుక సైన్స్ ఉంది. నిరంతరం భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. భూమి ఇలా సూర్యుడి చుట్టూ తిరగడం వల్లనే పగలు, రాత్రి ఏర్పడతాయి. అంతేకాదు.. వాతావరణంలో వైవిధ్యానికి కూడా ఇదే కారణం. దీంతో పగటిపూట సూర్యుని రంగు భిన్నంగా ఉన్నప్పటికీ.. ఉదయం లేదా సాయంత్రం అస్తమించినప్పుడు ఎరుపు రంగులో కనిపిస్తుంది.

వాస్తవానికి.. సూర్యకాంతి మారడానికి కారణం భూమి యొక్క వాతావరణం. 19వ శతాబ్దంలో బ్రిటీష్ భౌతిక శాస్త్రవేత్త లార్డ్ రీల్లీ కాంతిని చెదరగొట్టే దృగ్విషయం గురించి తెలిపాడు. సూర్యకాంతి సూర్యుని నుండి బయటకు వచ్చి వాతావరణంలోకి ప్రవేశించి, ధూళి, నేల కణాలతో ఢీకొని చెల్లాచెదురుగా మారే దృగ్విషయాన్ని కాంతి పరిక్షేపణం అంటారు. వాస్తవానికి, సూర్యుడి నుండి వచ్చే కాంతి స్పెక్ట్రం రంగులతో రూపొందుతుంది. అంటే వైలెట్, ముదురు నీలం, నీలం, ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్, ఎరుపు. వీటిలోని ప్రతి రంగు దాని స్వంత తరంగదైర్ఘ్యాన్ని కలిగివుంటుంది.

సూర్యుడు అస్తమించినప్పుడు లేదా ఉదయించినప్పుడు, దాని కిరణాలు వాతావరణంలోని పైపొరను తాకి ఒక నిర్దిష్ట కోణంలో వెళతాయి. అప్పుడు నీలి రంగుకున్న తరంగదైర్ఘ్యం విడిపోతుంది. హారిజోన్‌లో సూర్యుని ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే అధిక నీలం, ఆకుపచ్చ కాంతి తరంగాలు ఎక్కువ దూరం ప్రయాణించవు. చెల్లాచెదురవుతాయి. దీంతో మనకు మిగిలిన కాంతి తరంగాలైన ఆరెంజ్, ఎరుపు మొదలైనవి మాత్రమే కనిపిస్తాయి. అప్పుడు మనకు ఆకాశం ఎర్రగా కనిపిస్తుంది. అయితే సూర్యుని రంగు మారిందని దీని అర్థం కాదు. ఆకాశంలో ఉండే ధూళి, పొగ, ఇతర సారూప్య మూలకాలు, మేఘాలు దాని రంగును ప్రభావితం చేస్తాయని బ్లూమర్ వివరించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News