ఫిబ్రవరి 5న దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు ఒకదాన్ని మించి ఒక్కటి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నిరుద్యోగులను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐదేళ్లలో దిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు ఆయన గురువారం ఓ వీడియోను విడుదల చేశారు.
‘యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రాధాన్యత అన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తమ బృందం ఓ ప్రణాళికను రూపొందిస్తోందని చెప్పారు. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం రెండేళ్లలో 48 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. అంతేకాక 3 లక్షలకు పైగా ప్రైవేటు రంగ ఉద్యోగాలను కల్పించామన్నారు. ఉపాధి ఎలా సృష్టించాలో తమకు బాగా తెలుసునని చెప్పారు.
ప్రజల మద్దతుతో మళ్లీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో దిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తా’ అని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.3వ సారి అధికారం సాధించేందుకు ఆప్ ప్రయత్నిస్తుండగా.. ఈసారి ఎలాగైన ఆప్‌ను గద్దె దించేందుకు ఓ వైపు కాంగ్రెస్, భాజపా ప్రయత్నాలు చేస్తున్నాయి.
వచ్చే ఐదేళ్లలో దిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తా: కేజ్రీవాల్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES