భారతదేశంలో సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్, సామాజిక న్యాయం అనే పదానికి అసలు సిసలైన నిర్వచనాన్ని ఈ నాలుగున్నరేళ్ల పాలనలో చాటిచెప్పారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఈనెల 26వ తేదీ నుంచి మూడు ప్రాంతాల్లో ప్రారంభం కాబోతున్న సామాజిక సాధికార యాత్ర వివరాలను మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ ఇతర పార్టీ ముఖ్య నేతలు వివరించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక సాధికార యాత్ర వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
175 నియోజకవర్గాల్లో సామాజిక భేరి మోగించబోతున్నాం: మంత్రి జోగి రమేష్ జగనన్న పరిపాలన జనం మెచ్చిన పరిపాలన అని 77 సంవత్సరాల స్వతంత్య్ర భారత దేశ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా సామాజిక ధర్మాన్ని పాటించలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక ధర్మం పాటించిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అని మంత్రి జోగి రమేష్ తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వాన్ని పటిష్టపరుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి పేదలకు – పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధంలో గొంతు గొంతు కలిపి ఏకమై జగనన్నకు అండగా నిలుద్దామని మంత్రి పిలుపునిచ్చారు. జగనన్న పాలనలో కేబినెట్ కూర్పు దగ్గర నుంచి 68 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత కల్పించారని మంత్రి తెలిపారు. “టీడీపీ హయాంలో బీసీ అంటే బిజినెస్‌క్లాస్.. జగనన్న పాలనలో బీసీలను సమాజానికి బ్యాక్‌బోన్ క్లాస్‌గా మార్చారు. అలాంటి జగనన్నకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి 175 నియోజకవర్గాల్లో సామాజిక భేరి మోగించబోతున్నాం. మూడు విడతల్లో బస్సు యాత్ర ఉంటుంది. మొదటి విడత ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమల మూడు చోట్ల కూడా రణభేరి మోగించబోతున్నాం. పెత్తందార్ల కోటలను బద్ధలు కొట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలమంతా సంఘటితంగా ముందుకు వెళ్తున్నాం” అని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు నిజం గెలవాలని చంద్రబాబు సతీమణి యాత్ర చేపడుతున్నారని, నిజం ఈరోజుకైనా గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. పాపం పండింది, అవినీతి బయటపడింది కాబట్టే బాబు రాజమండ్రి జైల్లో ఉన్నాడని, నిజం గెలవాలని కాకుండా చంద్రబాబు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన పాపాలన్నీ పండాయి కాబట్టే అరెస్టు అయ్యాడుని, బోన్ ఎక్కాడని, కాబట్టి పాప పరిహార యాత్ర అని పేరుతో భువనేశ్వరి యాత్ర చేస్తే బాగుంటుందని సూచించారు. మాది పేదల యాత్ర, వారిది జైల్లోని వ్యక్తి కోసం యాత్ర: మంత్రి మేరుగ నాగార్జున బస్సు యాత్ర ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో జరుగుతుందని, బసు యాత్ర మొదటి దశ ప్రచారం అక్టోబర్ 26న ప్రారంభమై నవంబర్ 9 నాటికి ముగుస్తుందని మంత్రి తెలిపారు.
మొదటి యాత్ర రాష్ట్రవ్యాప్తంగా 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనుందని, ఈ యాత్ర అమలు కోసం, రాష్ట్రాన్ని ఉత్తర, మధ్య మరియు దక్షిణ ఆంధ్రాగా మూడు ప్రాంతాలుగా విభజించామని పేర్కొన్నారు. ప్రతి రోజు ఒక్కో ప్రాంతంలో ఒక్కో నియోజకవర్గం చొప్పున అలా మూడు చోట్ల యాత్ర సాగుతుందని తెలిపారు. దళితుల మీద చంద్రబాబు హయాంలో జరిగినన్ని దాడులు మరెప్పుడూ జరగలేదని, వైఎస్సార్‌సీపీ పాలనలో పేదల బతుకులు మారాయని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సామాజిక సాధికార యాత్ర పేరుతో తాము పేదల కోసం బస్సు యాత్ర చేస్తుంటే, నిజం గెలవాలనే పేరుతో వారు జైల్లో ఉన్న వ్యక్తి కోసం యాత్ర చేస్తున్నారంటూ మంత్రి భువనేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాలను ఒడు బ్యాంకుగానే చూశారని విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గిందని, వైయస్ఆర్సీపీ పేదల ప్రభుత్వమని ఉద్ఘాటించారు. చేసిన మేలు చెప్పుకునేందుకే సామాజిక సాధికార యాత్ర: మంత్రి సురేష్ చేసిన మేలు చెప్పుకునేందుకే సామాజిక సాధికార యాత్ర చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు ఈ యాత్ర ద్వారా వివరిస్తామని చెప్పారు. బ్యాక్ వార్డ్ క్లాస్ అంటే బాబు క్లాస్ అని చెప్పి ఈ వర్గాల ఓట్లు వాడుకున్నారు అని ఆరోపించారు మంత్రి సురేష్. పేదల పిల్లలకు ఇంగ్లీషు మీడియం వద్దని, ఇళ్ల పట్టాలు వద్దనీ, అమరావతిలో పేదలు ఉండడానికి వీల్లేదని చంద్రబాబు ప్రయత్నించారని, వారిని ఆలయాల్లోకి కూడా రానివ్వలేదని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే పేదలకు అవే ఆలయ కమిటీలలో పదవులు ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి తర్వాత తప్పించుకునే వ్యక్తి చంద్రబాబు అని, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి జగన్ అని మంత్రి ఆదిమూలపు అన్నారు. ‘‘నారా భువనేశ్వరి.. చంద్రబాబు ఎన్టీఆర్ ను ఎలాంటి వేధింపులకు గురి చేశారో చెప్పండి .. ఇప్పటికైనా నిజం చెప్పాలి’’ అని మంత్రి సురేశ్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థపై పవన్ కల్యాణ్ డ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న దళిత విద్యార్థులతో పవన్ ఇంగ్లీష్‌లో మాట్లాడగలరా? అని ప్రశ్నించారు. పక్షపాతం చూడకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంక్షేమం అందించిన సీఎం జగన్: మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఈ రాష్ట్ర వనరులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కూడా అందించాలనే తపనతో ముఖ్యమంత్రిగా జగన్ పని చేస్తున్నారని మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పనులు లేని సమయంలో చేయి చాచి అడుక్కునే పరిస్థితి రాకూడదని సీఎం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. కరోనా సమయంలో తిండిలేక అనేక రాష్ట్రాల్లో ప్రజలు చనిపోయారని, కానీ జగన్ పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి రాలేదని అని మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇది పేదలంతా కలిసి పెత్తాందారులను ఎదుర్కొనే యాత్ర: మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ ఈ సమావేశంలోనే మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ మాట్లాడుతూ గురువారం నుంచి జరిగే బస్సు యాత్రను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. జగన్ సీఎం అయ్యాక అనేక సంస్కరణలు తెచ్చారని, సామాజిక సంక్షేమాభివృద్దిని చేసి చూపించారని కొనియాడారు. వచ్చే ఎన్నికలు పేదలు పెత్తందార్ల మధ్య జరిగేవని స్పష్టం చేశారు. ‘‘సామాజిక న్యాయం కేవలం నినాదం కాదు.. అమలు చేయాల్సిన విధానం. జగన్ పేదల వైపు నిలపడితే, చంద్రబాబు పెత్తందార్ల వైపు నిలబడ్డారు. ఈ యుద్దంలో పేదలు బాగుపడాలంటే జగనే మళ్ళీ సీఎం కావాలి’’ అని ఆకాంక్షించారు. ఈ యాత్ర సామాజిక అవస్యకత కోసమే: ఎస్టీ సెల్ ఛైర్మన్ హనుమంత్ నాయక్ ఆంధ్రప్రదేశ్ జనాభాలో సుమారు 70% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ వర్గాలకు చెందినవారు ఉన్నారని, వారి అవసరాలను గుర్తించడం మన ప్రాథమిక కర్తవ్యం అని ఎస్టీ సెల్ ఛైర్మన్ హనుమంత్ నాయక్ అన్నారు. అనేక సంవత్సరాలుగా కులాలు, సంఘాలు, కుల దూరాభిమానాల కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు వెనుకబడ్డాయని, గతంలో రాజకీయ నాయకులు సైతం ఆయా వర్గాలను ఓటు బ్యాంకులా వాడుకోవడంతో ఎలాంటి అభివృద్ది, సంక్షేమ ఫలాలు వారికి అందలేదని ఆరోపించారు. అయితే ఇప్పుడు కొందరు రాజకీయ నాయకుల వల్ల కుల రాజకీయాలకు మరోసారి ఆధ్యంపోస్తున్నారని విమర్శించారు. బస్సు యాత్ర ఏ విధంగా సాగుతుందంటే? బస్సు యాత్ర ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో జరుగుతుంది. బస్ యాత్ర మొదటి దశ ప్రచారం అక్టోబర్ 26న ప్రారంభమై నవంబర్ 9 నాటికి ముగుస్తుంది. మొదటి యాత్ర రాష్ట్రవ్యాప్తంగా 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనుంది.
ఈ యాత్ర అమలు కోసం, రాష్ట్రాన్ని ఉత్తర, మధ్య మరియు దక్షిణ ఆంధ్రాగా మూడు ప్రాంతాలుగా విభజించాం. ప్రతి రోజు ఒక్కో ప్రాంతంలో ఒక్కో నియోజకవర్గం చొప్పున అలా మూడు చోట్ల యాత్ర సాగుతుంది. SC, ST, BC, మరియు మైనారిటీ వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ యాత్ర మధ్యాహ్న భోజన సమావేశంతో ప్రారంభమవుతుంది. యాత్ర సాయంకాలం వరకు అంతటా ప్రజలను ఉత్సాహపరస్తూ సాగుతుంది. చివరిగా ఆ నియెజకవర్గంలోని ఓ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజన సమావేశాలు: ప్రతి నియోజకవర్గంలో బస్సు యాత్ర భోజనంతో ప్రారంభమవుతుంది. అందులో ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు (RCలు) మరియు ముఖ్య నాయకులు….. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన తరగతులు (BC), మరియు మైనారిటీ వర్గాలకు చెందిన 200 మంది నాయకులతో కలిసి భోజనం చేస్తారు. అనంతరం మీడియా మిత్రులతో సమావేశమై యాత్ర గురించి వివరిస్తారు. నాయకులకు స్వాగతం, సంభాషణలు: బస్సు యాత్ర వెళ్లే మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, నాయకులు ముందుగా నిర్ణయించిన స్టాప్‌లలో ప్రజలతో మమేకమయ్యే విధంగా కొన్ని స్టాప్ లను పెట్టి స్వాగతించే విధంగా బోర్డులు పెడతారు. అటువంటి చోట్ల ఆగి బస్సుపై ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ముఖ్య నాయకులు మాట్లాడతారు. పబ్లిక్ మీటింగ్‌లు: ప్రతి నియోజకవర్గంలో బస్సు యాత్ర చివరిగా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. అక్కడ, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. దాదాపు పలు ప్రాంతాల నుంచి 10,000 మంది ప్రజలు ఈ సభల్లో పాల్గొంటారని అంచనా. అంతేకాకుండా అక్కడి స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా మైనార్టీ నాయకులు పాల్గొని వారి సంఘలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇందులో స్థానికంగా ఉండే ఏ సంఘం అయినా పాల్గొనవచ్చు.