Saturday, October 12, 2024
Homeపాలిటిక్స్YCP helping hand to flood victims: విజయవాడ వరద బాధితులకు వైసీపీ ఆపన్న...

YCP helping hand to flood victims: విజయవాడ వరద బాధితులకు వైసీపీ ఆపన్న హస్తం

వరదబాధితులకు వైస్సార్సీపీ ఆపన్నహస్తం. వరద బాధితుల కోసం మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్ ప్రకటించిన రూ.1 కోటి రూపాయలతో సహాయక చర్యలు.
ఒక నెల జీతాన్ని వితరణగా అందించిన వైయస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు.
ఇప్పటికే రెండు దశలలో సాయం అందించిన వైయస్సార్సీపీ.
రేపటి నుంచి మూడో దశ వరద సాయం.
రేషన్ సరుకులతో కూడిన 50 వేల స్పెషల్ ప్యాకెట్లు పంపిణీ.
పార్టీ సహాయకచర్యల్లో భాగంగా ఇప్పటికే తొలిదశలో 1 లక్ష పాలప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ.
రెండోదశలో 75వేల పాలప్యాకెట్లు, 1 లక్ష వాటర్ బాటిళ్లు పంపిణీ.
రేపటి నుంచి సరుకులతో కూడిన స్పెషల్ ప్యాకెట్లు పంపిణీ
పంపిణీ చేయనున్నస్పెషల్ కిట్లను పరిశీలించిన వైయస్సార్సీపీ నేతలు.

- Advertisement -

తాడేపల్లిలో..

మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాలలో రేపటి నుంచి సరుకులతో కూడిన స్పెషల్ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. వరద ప్రాంతాల బాధితులో కోసం వైయస్.జగన్ ప్రకటించిన రూ.1 కోటి ప్రకటించగా.. ఇప్పటికే రెండు విడతలగా పార్టీ కేడర్ సాయం అందించింది.


తొలివిడతలో 1 లక్ష పాలప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు, రెండోదశలో 75వేల పాలప్యాకెట్లు, 1 లక్ష వాటర్ బాటిళ్లు పార్టీ తరపున పంపిణీ చేశారు.
మూడో దశలో భాగంగా రేపటి నుంచి సరుకులతో కూడిన 50 వేల స్పెషల్ ప్యాకెట్లు వరద ప్రాంతాల్లో అందించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News