Saturday, October 12, 2024
Homeపాలిటిక్స్KTR: మా కొంప ముంచింది యూ ట్యూబే

KTR: మా కొంప ముంచింది యూ ట్యూబే

మన చిన్న మిస్టేక్ తో రేవంత్ సీఎ అయిండు

మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని పార్టీ యూత్ లీడర్లు, సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశమైన ప్రసంగించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖ్యంగా హైదరాబాద్ కు డేంజర్ ఉంది. 2014 లో కూడా హైదరాబాద్ ను యూటీ చేయాలని ప్రయత్నం చేశారు.

- Advertisement -

ఉమ్మడి రాజధానికి ఉన్న పదేళ్ల సమయం పూర్తికాగానే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని, హైదరాబాద్ ను యూటీ చేయొద్దంటే గులాబీ జెండా కచ్చితంగా లోక్ సభలో ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు దీన్ని అడ్డుకునే శక్తి, సత్తా లేదని ఆయన అన్నారు. హైదరాబాద్ పై పెత్తనం, కేసీఆర్ కు ఈ ప్రాంతం మీద పట్టు లేకుండా చేసేందుకు కూడా ఈ ప్రయత్నం చేస్తారని, కంటోన్మెంట్ లో ఇంచు భూమి కోసం మనల్ని చావగొట్టారని ఆయన గుర్తుచేశారు. సందు దొరికితే కచ్చితంగా హైదరాబాద్ ను తమ ఆధీనంలోకి తీసుకుంటారన్నారు. మోడీ ప్రియమైన ప్రధాని కాదు, ఫిర్రమైన ప్రధాని మాత్రమేనని, మోడీ హయాంలో ఉప్పు-పప్పు ధరలన్నీ పెరిగాయన్నారు.

యూట్యూబే మన కొంపముంచిందన్న కేటీఆర్, తప్పుడు ప్రచారం కారణంగా నష్టం జరిగిందని ఆరోపించారు. యూట్యూబ్ లో ధ్రువ్ రాఠీ అనే యువకుడు బీజేపీ బట్టలు ఊడదీస్తున్నాడని చెప్పిన కేటీఆర్ అదే విధంగా సోషల్ మీడియాలో ప్రతి వారియర్ బీజేపీ బండారం బయట పెట్టలని పిలుపునిచ్చారు.

బండి సంజయ్, ఈటల, రఘనందన్ రావు, సోయం బాపు రావు లను ఓడించిందెవరన్న కేటీఆర్, బీజేపోళ్లు మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, బీఆర్ఎస్ ప్రభుత్వాలను కూలగొట్టే ప్రయత్నం చేశారు కానీ అది సాధ్యం కాలేదన్నారు.

కానీ కాంగ్రెస్ ఎక్కడైతే ఉందో అదే రాష్ట్రాల్లో బీజేపీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టిందన్నారు. పోయిన సారి మల్కాజ్ గిరిలో జరిగిన తప్పు మళ్లీ ఈ సారి జరగకూడదన్నారు. 5 వేల ఓట్లతోనే ఓడిపోయామన్న ఆయన, మన చిన్న మిస్టేక్ కారణంగా మల్కాజ్ గిరి లో రేవంత్ రెడ్డి గెలిచి సీఎం పదవి వరకు వచ్చాడన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News