Monday, December 9, 2024
Homeపాలిటిక్స్YS Jagan: ఇదేం పాలన బాబూ.. జగన్ విమర్శలు

YS Jagan: ఇదేం పాలన బాబూ.. జగన్ విమర్శలు

YS Jagan| సీఎం చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన పోస్ట్ చేశారు. ఇదేం పాలన బాబూ అంటూ విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

- Advertisement -

“కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు గారు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం నాకు ఆవేదన కలిగించిందని ట్వీట్‌ చేశారు జగన్‌. చంద్రబాబు గారు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారనిమండిపడ్డారు.. అమ్మ ఒడిని, ఇంగ్లీష్ మీడియంను, 3వ తరగతి నుంచి టోఫెల్‌, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ నుంచి ఐబీదాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంట్‌, నాడు-నేడు ఇలా అన్నింటినీ రద్దుచేసి 1-12వ తరగతి విద్యార్థులను, వారి తల్లులను దెబ్బతీశారు.

వసతిదీవెన, విద్యాదీవెన నిలిపేసి, డిగ్రీ, ఇంజినీరింగ్‌, డాక్టర్‌ చదువులు చదువుతున్నవారినీ తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారని నిప్పులు చెరిగారు. ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడంలేదు, చదువులు పూర్తిచేసినవారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లూ ఇవ్వడంలేదన్నారు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదిలేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడమో చేయాల్సి వస్తోందన్నారు. వెంటనే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా వసతి దీవెన డబ్బులు విడుదలచేయాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాం. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబుగారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను” అంటూ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News