వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) మీడియా సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో కూటమి ప్రభుత్వ అరాచకాలపై, చంద్రబాబు మోసాలపై మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినటం లేదన్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చానన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. అన్ని రకాలుగా మోసం చేసిన తీరు మాత్రం తేటతెల్లంగా కనిపిస్తోందన్నారు.
బాబు ష్యూరీటీ భవిష్యత్తుకు గ్యారెంటీ గురించి మాట్లాడుతూ బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అయిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సెవెన్ అంటూ ఊదరగొట్టారని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ సూపర్ సిక్స్ అని ప్రశ్నించారు.
చంద్రబాబు దత్తపుత్రుడు కలిసి మెనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రతి ఇంటికి బాండ్లు పంచారు. 20 లక్షల ఉద్యోగాలు, మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి సాయం అన్నారు. ఇప్పుడు ఆ ఊసే లేదన్నారు. ఇప్పుడు హామీలు ఏవి అని అడిగితే సమాధానమే రావటం లేదని జగన్ మండిపడ్డారు.
రెండు బడ్జెట్ లలోనూ నిధులు కేటాయించటలేదన్నారు. ప్రజలను మోసం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 9 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పారు. గవర్నర్ తో కూడా అబద్దాలు చెప్పించారని దుయ్యబట్టారు.