వైఎస్ షర్మిల షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల పార్టీ పోటీ చేయటం లేదని ఆమె వెల్లడించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్న నేపథ్యంలో తాము బరిలో ఉంటే కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతింటాయని తమ పార్టీ బరిలోకి దిగట్లేదని ఆమె వెల్లడించారు. కాగా పాలేరు నుంచి బరిలోకి దిగేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న ఆమె, ఆతరువాత కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేసేందుకు పెద్ద ఎత్తున సన్నాహకాలు కూడా చేసుకుని ఆతరువాత ప్లాన్ ఛేంజ్ చేసుకున్నారు. ఆతరువాత అన్ని స్థానాల్లో నుంచి పోటీ చేస్తున్నట్టు, షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్, తల్లి విజయమ్మ కూడా బరిలో దిగతారంటూ ఓ దశలో జోరుగా ప్రచారం సాగింది. కానీ తాజాగా ఆమె ఈ నిర్ణయం ప్రకటించటంతో కాంగ్రెస్ పార్టీలో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభిమానుల్లో ఆనందం మిన్నంటింది. ఒకవేళ షర్మిల పార్టీ పోటీ చేస్తేకనుక శీనన్న వర్సెస్ షర్మిల అవుతుందన్న దిగులు ఇంతకాలం వీరందరినీ వేధించింది.
Sharmila: కాంగ్రెస్ లో ఆనందం నింపిన షర్మిల
ఎన్నికల్లో పోటీకి దూరంగా షర్మిల