Saturday, November 15, 2025
HomeTop StoriesYusuf Pathan Adina Masjid Controversy : అదినా మసీదు కాదు, ఆలయం! యూసుఫ్ పఠాన్...

Yusuf Pathan Adina Masjid Controversy : అదినా మసీదు కాదు, ఆలయం! యూసుఫ్ పఠాన్ పోస్టుపై బీజేపీ కౌంటర్

Yusuf Pathan Adina Masjid Controversy : భారత మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ యూసుఫ్ పఠాన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. మాల్దా జిల్లాలోని చారిత్రక అదినా మసీదును సందర్శించిన ఫొటోలతో పోస్ట్ చేసిన పఠాన్, దాని చరిత్రను వివరించడంతో బీజేపీ బెంగాల్ శాఖ తీవ్రంగా స్పందించింది. “అది మసీదు కాదు, ఆదినాథ్ ఆలయం” అని కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

ALSO READ: TG Local Body Elections తెలంగాణ స్థానిక ఎన్నికలపై బిగ్ అప్‌డేట్, ఆ నెలలోనే ఎన్నికలు

సుఫ్ పఠాన్ X (ట్విటర్)లో అదినా మసీదు ఫొటోలతో పోస్ట్ చేశారు. “మాల్దాలో 14వ శతాబ్దంలో ఇలియాస్ షాహీ వంశానికి చెందిన సికందర్ షా నిర్మించిన అదినా మసీదు, అప్పట్లో భారత ఉపఖండంలో అతిపెద్దది. ఇది మా మత, చరిత్ర ప్రతీక” అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ వైరల్ అయిన కొద్దిసేపటికే, బీజేపీ బెంగాల్ ట్వీట్ చేసింది “అదినా మసీదు అనేది పెద్ద మోసం. ఇది ఆదినాథ్ జైన్ ఆలయం. మసీదు అని పిలవడం చరిత్రను వక్రీకరించటం” అని. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. నెటిజన్లు “చరిత్రను మార్చడం మత వివాదానికి దారితీస్తుంది” అని వాదిస్తున్నారు.

అదినా మసీదు వివాదం తెరపైకి రావటం ఇదే మొదటిసారి కాదు. గతేడాది (2024) వృందావన్ విశ్వవిద్యా ట్రస్ట్ అధ్యక్షుడు హిరణ్మోయ్ గోస్వామీ నేతృత్వంలో పూజారుల బృందం మసీదులోకి ప్రవేశించి, హిందూ సంప్రదాయ పూజలు చేసింది. “ఇది ఒకప్పుడు ఆదినాథ్ జైన్ ఆలయం. దాని మీద మసీదు నిర్మించారు” అని వారు వాదించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు చేరుకుని వారిని అడ్డుకున్నారు. భారత పురావస్తు శాఖ (ASI) గోస్వామీపై కేసు నమోదు చేసింది. వివాదం తీవ్రమై, కట్టడాన్ని మూసివేశారు. సీసీటీవీలు, పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు.

 

ASI అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, అదినా మసీదు 1369లో బెంగాల్ సుల్తానేట్‌కు చెందిన సికందర్ షా నిర్మించారు. మత వాస్తుశిల్పానికి అద్భుత ఉదాహరణ, సికందర్ షా సమాధి కూడా ఉంది. ఈ కట్టడం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ASI స్థలం. ఈ వివాదం మత, చరిత్ర విభజనకు దారితీస్తోంది. టీఎంసీ “మత సామరస్యం” అని, బీజేపీ “చరిత్ర నిర్మాణం” అని వాదిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ “చరిత్రను రాజకీయం చేయకూడదు” అని స్పందించారు. ఈ చర్చ రాష్ట్ర రాజకీయాలకు మలుపు తిరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad