Homeపర్యావరణంEnvironment: ఆధ్యాత్మిక పేరుతో నదిలో 11 వేల లీటర్ల పాలు.. పర్యావరణవేత్తల ఆందోళన!

Environment: ఆధ్యాత్మిక పేరుతో నదిలో 11 వేల లీటర్ల పాలు.. పర్యావరణవేత్తల ఆందోళన!

Narmada river: మధ్యప్రదేశ్‌లోని సీహోర్‌ జిల్లా భైరూందాలో ఇటీవల జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. 21 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా.. నిర్వాహకులు ఏకంగా 11,000 లీటర్ల పాలను నర్మదానదిలోకి వదలడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

జలచరాలకు ప్రమాదం: నర్మదా నదిలో 11, 000 లీటర్ల పాలను వదలడం పట్ల పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ పర్యావరణ కార్యకర్త అజయ్‌ దూబే ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికత పేరుతో ఇంత పెద్ద మొత్తంలో పాలను నదిలో కలపడం వల్ల నీటిలో కాలుష్యం పెరుగుతుందని అన్నారు. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా పడిపోతుందని తెలిపారు. దీంతో జలచరాలు మృత్యువాత పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నర్మదానది నీటిపైనే ఆధారపడి జీవిస్తున్న స్థానికుల ఆరోగ్యంపై సైతం ఈ చర్య ప్రభావం చూపుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Also read-Big alert: భగ్గుమంటున్న భాగ్యనగరం.. ఆరెంజ్ అలర్ట్ జారీ!

నిర్వాహకుల వాదన: నదిలోని నీటి స్వచ్ఛతను కాపాడాలనేదే మా ఉద్దేశ్యమని ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. అందుకే ప్రార్థనలు చేసినట్లు పేర్కొన్నారు. భక్తిభావంతోనే ఈ పాలాభిషేకం నిర్వహించామని సమర్థించుకుంటున్నారు. ట్యాంకర్ల ద్వారా పాలను తరలించి నర్మదమ్మకు సమర్పించినట్లు వారు తెలిపారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News