Wednesday, January 8, 2025
HomeఆటWTC: 2025-27 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్.. భారత్ షెడ్యూల్ ఇదే

WTC: 2025-27 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్.. భారత్ షెడ్యూల్ ఇదే

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ను 3-1తో కోల్పోయిన టీమిండియా(Team India) 2023-25 WTC ఫైనల్‌ రేసు నుంచి తప్పుకుంది. దీంతో జూన్‌ 11 నుంచి ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌ మైదానంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తుది పోరు జరగనుంది. మరోవైపు ఈ ఏడాది జూన్‌లోనే 2025-27 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ప్రారంభంకానుంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో వచ్చే WTCలో భారత్ ఆడే మ్యాచ్‌ షెడ్యూల్ విడుదలైంది. ఇందులో భారత్ మొత్తం 18 టెస్టులు ఆడనుంది. స్వదేశంలో 9, విదేశీ గడ్డపై 9 టెస్టుల్లో తలపడనుంది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌ పర్యటనతో టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మొదలుకానుండగా.. 2027 జనవరి-ఫిబ్రవరిలో స్వదేశంలో జరిగే బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌తో మ్యాచ్‌లు ముగుస్తాయి.

WTC 2025-27 భారత మ్యాచ్‌ల షెడ్యూల్..

ఇంగ్లాండ్ జట్టుతో: 5 టెస్టులు, జూన్-ఆగస్టు 2025 (ఇంగ్లాండ్‌లో)
వెస్టిండీస్ జట్టుతో: 2 టెస్టులు, అక్టోబర్ 2025 (స్వదేశంలో)
దక్షిణాఫ్రికా జట్టుతో: 2 టెస్టులు, నవంబర్-డిసెంబర్ 2025(స్వదేశంలో)
శ్రీలంక జట్టుతో: 2 టెస్టులు, ఆగస్టు 2026 (శ్రీలంకలో)
న్యూజిలాండ్‌ జట్టుతో: 2 టెస్టులు, అక్టోబర్-డిసెంబర్ 2026 (న్యూజిలాండ్‌లో)
ఆస్ట్రేలియా జట్టుతో: 5 టెస్టులు, జనవరి-ఫిబ్రవరి 2027 (స్వదేశంలో)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News