Saturday, November 15, 2025
HomeఆటAsia Cup: ఆ ఐదుగురికి నిరాశేనా? ఒక్కమ్యాచ్ కూడా ఆడలేరా?

Asia Cup: ఆ ఐదుగురికి నిరాశేనా? ఒక్కమ్యాచ్ కూడా ఆడలేరా?

Asia Cup: ఆసియా కప్ మరో రెండ్రోజుల్లో ప్రారంభంకానుంది. టైటిల్ కోసం 8 జట్లు పోటీనున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, ఒమన్, హాంకాంగ్, ఆతిథ్య యూఏఈ జట్లు టైటిల్ రేసులో ఉన్నాయి. అయితే, ఈసారి ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. మైదానంలో 11 మంది ఆటగాళ్లు మాత్రమే ఆడుతారు. అయితే, డగౌట్‌లో కూర్చున్న చాలా మంది ఆటగాళ్లకు మొత్తం టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాదు. ఈ టోర్నమెంటులో కూడా అలాంటి ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు. 

- Advertisement -

నురుల్ హసన్ (బంగ్లాదేశ్)

బంగ్లాదేశ్ జట్టులో సీనియర్ వికెట్ కీపర్ నురుల్ హసన్‌ ఉన్నాడు. అయితే, కెప్టెన్ లిటన్ దాస్ ఇప్పటికే వికెట్ కీపింగ్ బాధ్యతలు చూసుకుంటున్నాడు. అందుకే, నురుల్‌కు ప్లేయింగ్ లెవన్‌లో చోటు దక్కడం చాలా కష్టం. అతను 2022 తర్వాత బంగ్లాదేశ్ తరఫున కేవలం ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. అతని చివరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో జరిగింది.

Read Also: Rithu Chowdary: బిగ్ బాస్ ఫస్ట్ కంటెస్టెంట్ గా జబర్దస్త్ బ్యూటీ.. డ్యాన్స్ తో ఎంట్రీ..!

హసన్ అలీ (పాకిస్థాన్)

ఈ సారి పాకిస్థాన్ జట్టులో పేసర్ హసన్ అలీ పేరు ఉంది. అయితే, జట్టులోకి తిరిగి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. హసన్ అలీ టీ20 రికార్డు అంతగా బాగాలేదు. ముఖ్యంగా అతని ఎకానమీ 9 పరుగుల కంటే ఎక్కువగా ఉంది. షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రౌఫ్ వంటి అద్భుతమైన బౌలర్లు జట్టులో ఉండటం వల్ల అతనిని ఆడించే అవకాశాలు చాలా తక్కువ.

Read Also: Putin: మాకు వ్యతిరేకంగా నిలిచే దేశాలను లక్ష్యంగా చేసుకుంటాం- పుతిన్

హర్షిత్ రాణా (భారత్)

భారత జట్టులో పేసర్లకు కొదవలేదు. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటికే ప్రధాన బౌలర్లు. హార్దిక్ పాండ్యా, శివం దూబే కూడా ఎక్స్ ట్రా బౌలింగ్ చేస్తారు. అందుకే, యువ ఆటగాడు హర్షిత్ రాణాకు అవకాశం రావడం దాదాపు అసాధ్యంగేన ఉంది. రికార్డు పరంగానూ హర్షిత్ రాణాకు అవకాశాలు రావడం తక్కువే. అతను ఇప్పటివరకు కేవలం ఒక టీ20 అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే ఆడాడు. అది కూడా సబ్​స్టిట్యూట్​గా.

దర్వేష్ రసూలీ (అఫ్గానిస్థాన్)

అఫ్గాన్ బ్యాటర్ దర్వేష్ రసూలీ అంతర్జాతీయ టీ20లో ఇప్పటివరకు తన మార్క్ చూపించలేకపోయాడు. అతను 12 మ్యాచ్‌లలో కేవలం 149 పరుగులు మాత్రమే చేశాడు. అతని యావరేజ్ (15), స్ట్రైక్ రేట్ (112) రెండూ అంతంతమాత్రమే. అందుకే, టీమ్ మేనేజ్‌మెంట్ అతనిని ఆడించడానికి ఆసక్తి చూపకపోవచ్చు.

 చమికా కరుణారత్నే (శ్రీలంక)

శ్రీలంక ఆల్ రౌండర్ చమికా కరుణారత్నే ఫామ్ అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతను గత రెండేళ్లలో కేవలం రెండు టీ20లు మాత్రమే ఆడి, ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. జట్టులో అతని కంటే మెరుగైన బౌలింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉండటంతో అతను ఆడే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad