Saturday, November 15, 2025
HomeఆటT20I Match: అన్‌బ్రేకబుల్ వరల్డ్ రికార్డ్ .. 5 బంతుల్లో 5 వికెట్లు!

T20I Match: అన్‌బ్రేకబుల్ వరల్డ్ రికార్డ్ .. 5 బంతుల్లో 5 వికెట్లు!

5 Wickets in 5 Consecutive Balls: టీ20 మ్యాచ్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. కలలో కూడా ఊహించని రికార్డ్ నమోదయింది. టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారిగా 5 బంతుల్లో 5 వికెట్లు తీసి ప్రపంచ రికార్డును నమోదు చేశాడు ఓ బౌలర్. అయితే ఆ డేంజరస్ బౌలర్ ఎవరూ.. ఎక్కడ ఈ మ్యాచ్ జరిగిందో తెలుసుకుందాం!

- Advertisement -

తొలి క్రికెటర్ ఇతనే: టీ20 మ్యాచ్‌లో ఊహకందని అద్భుతం జరిగింది. టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారిగా, అసాధ్యమైన ప్రపంచ రికార్డు నమోదయింది. టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారిగా 5 బంతుల్లో 5 వికెట్లు తీసి ప్రపంచ రికార్డును ఐర్లాండ్‌ బౌలర్ నెలకొల్పాడు. బౌలింగ్ ఆల్ రౌండర్ కర్టిస్ కాంఫర్ టీ20 క్రికెట్‌లో వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీసిన అరుదైన రికార్డును నమోదు చేశాడు. 26 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ టీ20 క్రికెట్‌లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన తొలి క్రికెటర్ ఇతనే. కర్టిస్ కాంఫర్ ఐరిష్ ఇంటర్-ప్రావిన్షియల్ టీ20 ట్రోఫీలో మున్స్టర్ రెడ్స్ తరపున ఆడుతున్నప్పుడు నార్త్-వెస్ట్ వారియర్స్‌పై ఈ రికార్డు నెలకొల్పాడు.

అన్‌బ్రేకబుల్ వరల్డ్ రికార్డు: నార్త్-వెస్ట్ వారియర్స్‌తో జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో కర్టిస్ కాంపర్ 2.3 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కర్టిస్ కాంపర్ జట్టు మున్స్టర్ రెడ్స్ నార్త్-వెస్ట్ వారియర్స్‌కు 189 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నార్త్-వెస్ట్ వారియర్స్ జట్టు ఒక దశలో 5 వికెట్లు కోల్పోయి 87 పరుగులు మాత్రమే చేసింది. మిగిలిన 5 వికెట్లను రెడ్స్ కెప్టెన్ కర్టిస్ కాంపర్ వరుస బంతుల్లో పడగొట్టి నార్త్-వెస్ట్ వారియర్స్ జట్టును 13.3 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌట్ చేశాడు.

ఈ అద్భుతం ఎలా జరిగిందంటే: నార్త్-వెస్ట్ వారియర్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్ చివరి 2 బంతుల్లో కర్టిస్ కాంపర్ రెండు వికెట్లను కూల్చాడు. ఆ తర్వాత, కర్టిస్ కాంపర్ 14వ ఓవర్ ను బౌల్ చేసేందుకు వచ్చి.. మొదటి 3 వరుస బంతుల్లో 3 వికెట్లు పడగొట్టాడు. వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టడంతో.. కర్టిస్ కాంపర్ నార్త్-వెస్ట్ వారియర్స్ జట్టును 13.3 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌట్ చేశాడు. కర్టిస్ కాంపర్ 14వ ఓవర్లో తన హ్యాట్రిక్ రికార్డును సైతం సృష్టించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad