Wednesday, December 18, 2024
HomeఆటAUS vs IND: రసవత్తరంగా మూడో టెస్టు.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

AUS vs IND: రసవత్తరంగా మూడో టెస్టు.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

AUS vs IND: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో (Border – Gavaskar Trophy 2024) భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 8 పరుగులు మాత్రమే చేసి 260 పరుగులకు ఆలౌట్ అయింది.

- Advertisement -

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో ఆసీస్ 89/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసి టీమిండియాకు 275 పరుగుల టార్గెట్ ఇచ్చింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు, సిరాజ్ రెండు, ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీశారు.

275 పరుగుల లక్ష్యంతో బరితో దిగిన టీమిండియా టీ బ్రేక్ సమయానికి 8/0 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జైశ్వాల్, రాహుల్ చెరో 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరి భారత ప్లేయర్లు టార్గెట్ ఛేదిస్తారా.. లేదంటే ఆస్ట్రేలియా బౌలర్లకు చిక్కుకుపోతారా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు వరుణుడు ఆటంకం కలిస్తుండటంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News