Sunday, November 16, 2025
Homeఆటబిల్డప్ బాబాయ్ ఓవరాక్షన్ తగ్గట్లేదుగా.. దిగ్వేశ్ ఇలా అయితే కష్టమే..!

బిల్డప్ బాబాయ్ ఓవరాక్షన్ తగ్గట్లేదుగా.. దిగ్వేశ్ ఇలా అయితే కష్టమే..!

ఐపీఎల్ 2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మ్యాచ్‌ ఉత్కంఠపూరిత గెలుపుతో పాటు వివాదం కూడా చోటు చేసుకుంది. 6 వికెట్ల తేడాతో SRH గెలిచిన ఈ మ్యాచ్‌కి అభిషేక్ శర్మ, దిగ్వేశ్ రాఠి మధ్య జరిగిన ఘర్షణ మరింత దృష్టిని ఆకర్షించింది. ఈ మ్యాచ్ లో లక్నో జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 205/7 స్కోరు చేసింది. భారీ లక్ష్యాన్ని వెంటనే ఛేజ్ చేయడంలో SRH చురుగ్గా ఆడింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. కేవలం 20 బంతుల్లోనే 59 పరుగులు (4 ఫోర్లు, 6 సిక్సులు) బాది SRH విజయానికి బాటలు వేశాడు.

- Advertisement -

అయితే దిగ్వేశ్ రాఠి బౌలింగ్‌లో పెద్ద షాట్‌కు ప్రయత్నించిన అభిషేక్ ఔట్ కావడం.. ఆ వెంటనే రాఠి నోట్‌బుక్ సెలబ్రేషన్ చేయడం వివాదానికి కారణమైంది. పెవిలియన్ వెళ్తున్న అభిషేక్ అతన్ని చూసి ఏదో వ్యాఖ్య చేయగా.. దిగ్వేశ్ ఒక్కసారిగా దూకుడుగా అతని వైపు నడిచి వచ్చి ఘర్షణకు దిగాడు. అంపైర్లు, సహచరులు కలగజేసుకోవడంతో మాటల యుద్ధం ఆగింది.

దిగ్వేశ్ మరో ఓవర్‌లో ఇషాన్ కిషన్‌ను కూడా ఔట్ చేసినప్పుడు అదే శైలిలో పెవిలియన్ వైపు చూస్తూ సెలబ్రేట్ చేయడం పట్ల లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ అసహనం వ్యక్తం చేసినట్లు కెమెరాల్లో కనిపించింది. మ్యాచు తర్వాత షేక్‌హ్యాండ్ సమయంలో అభిషేక్, దిగ్వేశ్ మళ్లీ ఎదురుపడగా వాతావరణం కొద్దిగా ఉద్రిక్తతగా మారింది. అయినా వారు తర్వాత సాధారణంగా కనిపించారు.

ఈ వాగ్వివాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో పాటు దిగ్వేశ్ రాఠిపై విమర్శలు పెరుగుతున్నాయి. గతంలోనూ అతను తన సంబరాల వల్ల వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అతడికి ఇప్పటివరకు జరిమానాలు పడిన సందర్భాలూ ఉన్నాయి. అయినప్పటికీ అతని ‘నోట్‌బుక్ సెలబ్రేషన్స్’ కొనసాగుతుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad