Sunday, January 18, 2026
HomeఆటGoogle trends: పాకిస్థానీలు గూగుల్‌లో ఎక్కువగా వెతికిన క్రికెటర్ ఎవరో తెలుసా?

Google trends: పాకిస్థానీలు గూగుల్‌లో ఎక్కువగా వెతికిన క్రికెటర్ ఎవరో తెలుసా?

Google trends india: 2025 సంవత్సరం ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ ఏడాది భారత్ క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించింది. ఈ సంవత్సరం ఇండియన్ క్రికెట్ టీమ్ లోకి ఎంతో మంది యువకులు ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2025లో టీమ్ ఇండియా దాయాది పాకిస్థాన్ పై సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. ఇరు జట్ల మధ్య నాలుగు వన్డేల్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇందులో మూడు విజయాలు ఆసియా కప్ లోనూ, ఒక గెలుపు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ నమోదైంది.

- Advertisement -

ఈ సంవత్సరం జరిగిన ఆసియా కప్ లో అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో 44.85 సగటు, 200 స్ట్రైక్ రేట్ తో 314 పరుగులు చేశాడు. భారత్, పాక్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు, సూపర్-4 మ్యాచ్ లో 39 బంతుల్లో 74 పరుగులు చేశాడు. అయితే ఫైనల్లో మాత్రం విఫలమయ్యారు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ తమ బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్ గురించి తెలుసుకోవడానికి పాక్ నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపారట. ఈ మేరకు గూగుల్‌ ‘మోస్ట్‌ సెర్చ్‌డ్‌ క్రికెటర్‌ ఇన్‌ పాకిస్థాన్‌ 2025’ జాబితాలో అభిషేక్ ఆగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాకుండా తొలి ఐదు స్థానాల్లో నిలిచిన పాకిస్థానేతర ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Also Read: Ind vs SA -భారత్-సౌతాఫ్రికా తొలి టీ20 నేడే.. మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?

మరోవైపు గూగుల్ ఫర్ ఇండియా విడుదల చేసిన లిస్ట్ లో అభిషేక్ భారత్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఎలైట్ సెలబ్రిటీలో జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో 14 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ప్రాతినిధ్యం వహించిన వైభవ్ మంచి ప్రదర్శన చేశాడు. టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ కూడా టాప్-10లో చోటు దక్కించుకుంది. భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలవడంలో జెమీమా కీలకపాత్ర పోషించింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News