Sunday, April 13, 2025
HomeఆటAbhishek Sharma: అభిషేక్ శర్మ స్లిప్ సెలబ్రేషన్.. రాసుకొచ్చి మరీ దుమ్మురేపాడు..!

Abhishek Sharma: అభిషేక్ శర్మ స్లిప్ సెలబ్రేషన్.. రాసుకొచ్చి మరీ దుమ్మురేపాడు..!

రన్స్ లేవని విమర్శలు, ఫామ్ లో లేడని ట్రోల్స్.. వేరే ప్లేయర్ ని తీసుకోవాలంటూ సూచనలు.. ఇవన్నీ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ ఆడక ముందు అభిషేక్ శర్మపై ఉన్న విమర్శలు. అయితే ఒక్క ఇన్నింగ్స్ లో ఈ టీమిండియా యంగ్ ప్లేయర్ అందరికీ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పంజాబ్ మ్యాచ్‌తో అభిషేక్ పేరు ట్రెండ్ అవుతోంది. సెంచరీతో SRH విజయానికి బాటలు వేసి, “ఒంటరిగా ఓ మ్యాచ్ ఎలా గెలిపించాలో ప్రాక్టికల్ డెమో ఇచ్చాడు.

- Advertisement -

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయం నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌ తో జరిగిన హోమ్ మ్యాచ్‌ లో హైదరాబాద్ 246 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి, మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంలో కీలకంగా నిలిచిన వ్యక్తి అభిషేక్ శర్మ. ఐపీఎల్ 2024లో హిస్టారిక్ ఫార్మ్ కనబర్చిన అభిషేక్, టీమిండియాకు టీ20 ఓపెనర్‌గా కూడా ఎదిగాడు. కానీ 2025 IPLలో అంత గొప్ప ఫామ్ లో కనిపించలేదు. తొలి ఐదు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 51 పరుగులే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. విశ్లేషకులైతే బెంచ్ కుర్చీకి పంపాలని సైతం సూచించారు.

అయితే SRH మాత్రం అతడిపై నమ్మకాన్ని చూపింది. ఆ నమ్మకానికి తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు అభిషేక్. పంజాబ్ బౌలర్లకు వైల్డ్ ఫైర్ ఆట ఏంటో చూపించాడు. కేవలం 19 బంతుల్లో అర్ధ సెంచరీ, 40 బంతుల్లో శతకం పూర్తి చేసి… చివరికి 55 బంతుల్లో 141 పరుగులతో పేలిపోయాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 బౌండరీలు, 10 సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు తన సెంచరీ అనంతరం అభిషేక్ చూపించిన పేపర్ మాజిక్ అభిమానుల్లో ఉద్వేగాన్ని రేపింది. “This One is for Orange Army” అని రాసి ఉన్న ఆ మెసేజ్‌ను స్టేడియం మొత్తం చూపిస్తూ, తాను ఆరెంజ్ ఆర్మీకి అప్పగించిన గౌరవాన్ని ప్రకటించాడు. ఆ క్షణం స్టేడియం మొత్తం ఊగిపోయింది.

ఈ విజయం ద్వారా హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి చేరింది. నాలుగు వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఈ గెలుపు, జట్టుకు కొత్త శక్తిని నింపినట్లైంది. అభిషేక్ ఇలాంటి ఇన్నింగ్స్ కొనసాగిస్తే, SRH ఈ సారి ఐపీఎల్ ట్రోఫీ సాధించడం పక్కా అంటున్నారు అభిమానులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News