Abhishek Sharma: ఆసియా కప్ లో దాయాది సేనకు భారత్ షాక్ ఇచ్చింది. లక్ష్యం చిన్నదైనా కాపాడుకొనేందుకు పాక్ చివరివరకూ పోరాడుతుంది. అయితే, ఆ టీమ్‌కు అవకాశం ఇవ్వకుండా భారత్ ఆధిపత్యంతో అదరగొట్టింది. అన్ని రంగాల్లోనూ పట్టుబిగించి విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో విజృంభించిన భారత్ ప్రత్యర్థి పాక్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఆ తర్వాత స్టార్ పేసర్ షహీన్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటుందా? అనే అనుమానాలకు భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సరైన జవాబు ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే దూకుడుగా ఆడేశాడు. ఈక్రమంలో ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు.
Read Also: Railways: టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేయవచ్చా? రైల్వే నిబంధనలు ఏంటో తెలుసా?
విరాక్ రికార్డు వెనక్కి..
పాక్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ (31: 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడేశాడు. దీంతో పాక్‌పై పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఆ ఘనత విరాట్ పేరిట ఉండేది. దుబాయ్ వేదికగానే 2022లో విరాట్ కోహ్లీ 29 పరుగులు చేశాడు. అదే ఏడాది రోహిత్ శర్మ కూడా 28 పరుగులు రాబట్టాడు. భారత్ తరఫున అభిషేక్ టాపర్ కాగా.. ఓవరాల్‌గా మాత్రం పాక్ మాజీ ఆటగాళ్లు నసీర్ జంషెడ్ (2012లో 34 రన్స్), ఇమ్రాన్ నజీర్ (2007లో 33 పరుగులు) ముందున్నారు. ఇకపోతే, ఆసియా కప్ గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా మరో 25 బంతులు మిగిలిఉండగానే ఛేదించింది. కాగా.. భారత్-పాక్ మధ్య జరిగిన తొమ్మిది టీ20 మ్యాచుల్లో ఛేదనకు దిగిన జట్టు గెలవడం ఇది ఎనిమిదోసారి. న్యూయార్క్‌లో గత పొట్టి కప్‌లో మాత్రమే మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ విజయం సాధించింది.
Read Also: Puja Khedkar: మరో వివాదంలో పూజా ఖేడ్కర్.. కిడ్నాప్ కేసు నమోదు
ఇవాళ్టి మ్యాచ్ లు
ఆసియా కప్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అబుదాబి వేదికగా యూఈఏ, ఒమన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మరో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక, హాంకాంగ్ తలపడనున్నాయి.


