ICC T20I Rankings 2025 Update: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ ఆటగాళ్లు మరోసారి సత్తా చాటారు. టీ20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో అభిషేక్ అగ్రస్థానంలో ఉంటే, బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి నెంబర్ 1 బౌలర్ గా ఉన్నాడు. అభిషేక్ 925 రేటింగ్ పాయింట్లతో ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఇక రెండో స్థానంలో ఇంగ్లాండ్ ఫ్లేయర్ ఫిల్ సాల్ట్ ఉండగా.. మూడో స్థానంలో తిలక్ వర్మ ఉన్నాడు. టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు.
బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. వెస్టిండీస్ స్పిన్నర్ అకేల్ హోసేన్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ జంపా నాల్గో స్థానం నుండి ఏడో స్థానానికి దిగజారాడు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ భారత్ తో సిరీస్ లో మంచి ప్రదర్శన చేయడంతో రెండు స్థానాలు ఎగబాకి టాప్-10కు చేరుకున్నాడు. శ్రీలంకకు చెందిన వానిందు హసరంగా, ఇంగ్లాండ్‌కు చెందిన ఆదిల్ రషీద్ మరియు నువాన్ తుషారలు ఒక్కో స్థానం ఎగబాకారు. ఆసీస్ తో సిరీస్ ఆడకపోయిన హార్దిక్ పాండ్యా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
Also read: IND vs AUS 4th T20I- భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20 నేడే.. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
ప్రోటీస్ తో సిరీస్ లో అద్భుతంగా రాణించడం ద్వారా పాక్ ఆటగాళ్లు తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. చాలా రోజుల తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చిన పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 30వ స్థానానికి, సైమ్ అయూబ్ 10 స్థానాలు ఎగబాకి 39వ స్థానానికి, సల్మాన్ అఘా 10 స్థానాలు ఎగబాకి 54వ ర్యాంక్ కు చేరుకున్నారు. ఈ ఏడాది పాకిస్తాన్ ఆడిన ఐదు ద్వైపాక్షిక T20I సిరీస్‌లలో నాలుగు గెలిచి.. వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్ కు తయారుగా ఉంది.
Also Read: Sri Charani -వరల్డ్ కప్ విజయంలో కడప అమ్మాయి.. అసలు ఎవరీ శ్రీచరణి?


