HomeఆటBCCI Awards: ఆంధ్రా క్రికెటర్లకు పురస్కారాలు.. మిథాలీరాజ్, శ్రీచరణి, ఎండీ షబ్నంలను అభినందించిన ‘ఏసీఏ’

BCCI Awards: ఆంధ్రా క్రికెటర్లకు పురస్కారాలు.. మిథాలీరాజ్, శ్రీచరణి, ఎండీ షబ్నంలను అభినందించిన ‘ఏసీఏ’

BCCI Awards ACA: బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఐసీసీ ఛైర్మన్ జైషా, ఏసీఏ కార్యదర్శి సనా సతీష్ బాబు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సందర్భాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన ఆంధ్రా క్రికెటర్లకు అవార్డులందజేశారు. వారి అసాధారణ ప్రతిభ, అంకితభావాన్ని తెలియజేసేలా గొప్ప అవార్డులు సాధించారని వక్తలు కొనియాడారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/lifestyle/nidrapoyetappudu-juttu-vidichipettala-leka-jada-vesukovala-hair-care-tips/

మిథాలీ రాజ్‌కు లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు, శ్రీచరణికి ఇంటర్నేషనల్ డెబ్యూ క్రికెటర్ అవార్డు, ఎండీ షబ్నమ్‌కు అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ టీం అవార్డును ప్రకటించారు. మిథాలీ రాజ్‌కు జైషా చేతుల మీదుగా అవార్డు అందజేశారు. ఈ విషయం ఏసీఏకే గర్వకారణమని అతిథులు పేర్కొన్నారు.

Also Read: https://teluguprabha.net/business/gold-rates-march-16-2026-hyderabad-chennai-bangalore-160480/

అవార్డుల ప్రదానోత్సవం అనంతరం ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు కేశినేని శివనాథ్ (చిన్ని), సానా సతీష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రా క్రికెటర్లు ఈ గొప్ప అవార్డులతో సత్కరించడం తమకు అపార గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని ఆకాక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News