Saturday, November 15, 2025
HomeTop StoriesRCB: ఆర్సీ ఫ్రాంఛైజీ భవిష్యత్ ఏంటో..? అమ్మకానికి లలిత్ మోదీ షేర్లు?

RCB: ఆర్సీ ఫ్రాంఛైజీ భవిష్యత్ ఏంటో..? అమ్మకానికి లలిత్ మోదీ షేర్లు?

RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఫ్రాంచైజీ భవిష్యత్తుపై ప్రస్తుతం ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025 సీజన్‌లో ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఆ ఆనందం రెండు రోజులు కూడా ఉండగానే విన్నింగ్ సెలబ్రేషన్స్‌లో తొక్కిసలాట జరిగి, అభిమానులు మరణించారు. తాజాగా లేక లేక కప్పు గెలిచిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ని అమ్మేయాలని నిర్ణయం తీసుకుందట డియాజియో పీఎల్సీ. అయితే, కొన్ని రోజుల క్రితం ఐపీఎల్ మాజీ ఛైర్మెన్ లలిత్ మోదీ, ఆర్‌సీబీ ఓనర్లు మారబోతున్నారని హింట్ ఇచ్చాడు. డియోజియో షేర్లు అమ్మకానికి పెట్టబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి.  కాగా.. ఈ వార్తలకు మరింత బలం ఇచ్చేలా ఆర్‌సీబీ టీమ్‌ని కొనబోతున్నట్టుగా  సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో హింట్ ఇచ్చాడు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. ‘సరైన ధరకి, ఆర్‌సీబీ చాలా గొప్ప టీమ్…’ అంటూ ట్వీట్ చేశాడు అదార్ పూనావల్ల. ఈ ట్వీట్ తో ఉన్న అదార్ పూనావల్ల ట్వీట్‌తో ఆర్‌సీబీ జట్టుని, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొనబోతున్నట్టుగా కొన్ని రోజులు వార్తలు వస్తున్నాయి. తాజాగా అదార్ పూనావల్ల, ఆ వార్తలను దాదాపు ఖాయం చేసేశాడు.

- Advertisement -

గతంలో లలిత్ మోదీ ట్వీట్

ప్రస్తుత ఆర్సీబీ యాజమాన్యం డియాజియో పీఎల్సీ (Diageo Plc) ఈ ఫ్రాంచైజీని విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు లలిత్ మోదీ వెల్లడించారు. తన అధికారిక ‘ఎక్స్’ అకౌంట్ లో ఆయన ఈ విషయం గురించి ఓ పోస్ట్ చేశారు. లలిత్ మోదీ తన ఎక్స్ పోస్టులో.. “చివరకు యజమానులు దీన్ని తమ బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగించి, అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో ఐపీఎల్ గెలిచినందున, బలమైన అభిమాన గణం, అద్భుతమైన నిర్వహణ బృందం ఉన్నందున, ఇది మొత్తం ఐపీఎల్ ఫ్రాంచైజీగా అమ్మకానికి అందుబాటులో ఉన్న ఏకైక జట్టు కావచ్చు.” అని అన్నారు. కాగా.. ఇప్పుడు అదార్ పూనావాల్లా ఈ ట్వీట్ చేయడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయ్యింది.

Read Also: Bigg Boss Voting: ‘దమ్ము’ మిడ్ వీక్‌లోనే మాయమవుతోందా?.. ఈ వారం ఇద్దరు ఫిక్స్..!

రజత్ పటిదార్ కెప్టెన్సీలో..

ఐపీఎల్ 2025 సీజన్‌లో రజత్ పటిదార్ కెప్టెన్సీలో మొట్టమొదటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ని సొంతం చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై విజయం అందుకుంది ఆర్‌. సీ. బీ… ఐపీఎల్ 2025 ఫైనల్ గెలిచిన తర్వాతి రోజు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విన్నింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించింది టీమ్ మేనేజ్‌మెంట్. అయితే ఈ సమయంలో భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి, 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read Also: Bigg Boss Suman Shetty: ఆమె నోటిలో నోరు పెట్టలేను.. ఆళ్లలాగా కుక్కల్లా అరవాలా.. సంజనాపై సుమన్ శెట్టి ఫైర్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad