ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్తాన్-ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 12.5 ఓవర్లలో 109 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మ్యాచ్ కు ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇవ్వగా.. ఆస్ట్రేలియా నాలుగు పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. అఫ్ఘానిస్థాన్ మూడు పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. అఫ్ఘాన్ బ్యాటర్లలో అటల్ 85, అజ్మతుల్లా 67 పరుగులతో రాణించారు. అనంతరం 274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది ఆస్ట్రేలియా.
మ్యాథ్యూ (20) ట్రావిస్ హెడ్ (59, నాటౌట్), స్టీవ్ స్మిత్ (19, నాటౌట్) పరుగులు చేశారు. అనంతరం వర్షం పడడంతో మ్యాచ్ రద్దు అయింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో మరో రెండు మ్యాచులు మిగిలి ఉన్నాయి. శనివారం దక్షిణాఫ్రికా- ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఆదివారం న్యూజిలాండ్- ఇండియా మ్యాచ్ ఉంది. ఈ మ్యాచులు ముగిస్తే సెమీఫైనల్‌లో ఎవరు ఎవరితో తలపడతారో తేలుతుంది.