Sunday, November 16, 2025
HomeఆటInd vs Pak: పాక్ తో భారత్ పోరు.. తుది జట్టులో ఉండేది ఎవరంటే?

Ind vs Pak: పాక్ తో భారత్ పోరు.. తుది జట్టులో ఉండేది ఎవరంటే?

Ind vs Pak: ఆసియా కప్ లో టైటిల్ ఫేవరేట్ గా టీమిండియా బరిలో దిగింది. బుధవారం, యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు సులభంగా గెలిచింది. దీంతో, ఇప్పుడు అందరూ పాకిస్థాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఆదివారం క్రికెట్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ కానుంది. సూపర్‌ సండేగా మారనుంది. ఎందుకంటే, ఆసియా కప్ లో పాకిస్థాన్, భారత జట్టుతో తలపడనుంది. సెప్టెంబర్ 14న జరగనున్న ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఎవరుంటారో ఇప్పటికే ఒక పెద్ద హింట్ లభించింది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత జట్టులో 5 బ్యాట్స్‌మెన్, 3 ఆల్‌రౌండర్లు, 3 బౌలర్లు ఉంటారని తెలుస్తోంది.

- Advertisement -

Read Also: Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోలు హతం

అజయ్ జడేజా ఆన్సర్..

పాకిస్థాన్‌తో తలపడే భారత జట్టులో ఎవరు ఉంటారనేది బిగ్ క్వశ్చన్ గా మారింది. ఈ ప్రశ్నకు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా గ్రేట్ ఆన్సర్ ఇచ్చారు. అజయ్ జడేజా ప్రకారం.. యూఏఈతో ఆడిన జట్టునే పాకిస్థాన్‌తో కూడా ఆడనుంది. అంటే జట్టులో ఎలాంటి మార్పులు ఉండవు. ఈ విషయాన్ని అజయ్ జడేజా భారత్ vs యూఏఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సోనీ నెట్‌వర్క్ ఛానెల్‌లో మాట్లాడారు. యూఏఈకి వ్యతిరేకంగా భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌పై అజయ్ జడేజా మాట్లాడుతూ.. “యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 మంది బ్యాటర్లను ఆడించకూడదు. కానీ, అలా ఆడిస్తే.. పాకిస్తాన్‌తో ఆడాల్సిన జట్టు అదే” అని అన్నారు. అంటే, యూఏఈ మీద ఆడిన జట్టునే పాకిస్థాన్‌ మీద కూడా ఆడిస్తారని హింట్ ఇచ్చారు.

Read Also: Bigg Boss New Promo: గుడ్డు గురించి రచ్చ.. హరీష్ పై కామనర్స్ ఫైర్..!

జట్టులో ఉండేది ఎవరంటే?

యూఏఈతో ఆడిన జట్టునే పాకిస్థాన్‌తో కూడా ఆడిస్తే, ఈ క్రింది విధంగా భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఉండవచ్చు. బ్యాట్స్‌మెన్లుగా శుభ్‎మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్)గా ఉండనున్నారు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ పాక్ తో జరిగే పోరులో జట్టులో ఉండనున్నారు. బౌలర్లు కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా బరిలో దిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad