Friday, November 22, 2024
HomeఆటAdudam Andhra: క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి

Adudam Andhra: క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి

ఆడదాం ఆంధ్రపై వాలంటీర్లకు శిక్షణ

రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు వాలంటీర్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ కిషోర్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని జై కిసాన్ పార్క్ నందు షాప్ జిల్లా కోఆర్డినేటర్స్ స్వామిదాస్ రవికుమార్, పెరుమళ్ళ శ్రీనాథ్ ల ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పై వాలంటీర్లు కు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమిషనర్ కిషోర్ హాజరయ్యారు. శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ తమ వార్డుల్లో క్రీడలపై ఆసక్తి కలిగిన క్రీడాకారులను గుర్తించి ప్రభుత్వం చేపట్టే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వాలంటీర్లకు తప్పనిసరని సూచించారు. అలాగే 15 సంవత్సరాలు పైబడిన పురుషులు స్త్రీలు ఈ క్రీడలలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన తెలియజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వాళ్లు ప్రతిభ ను మెరుగుపరిచేందుకు ఆడదాం ఆంధ్ర ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రతి క్రీడాకారుడు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శాప్ కోఆర్డినేటర్స్ కోఆర్డినేటర్ స్వామి దాస్ రవి కుమార్, పేరుమాళ్ళ శ్రీనాథ్ లు మాట్లాడుతూ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిర్వహణలో ఏపీలో క్రీడారంగం ఎంతో అభివృద్ధికి నోచుకుంటుందన్నారు. సీఎం జగనన్న పాలనలో క్రీడాకారుల ప్రోత్సాహ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత దక్కిందన్నారు. ప్రతి క్రీడాకారుడు ప్రభుత్వం నిర్వహించే ప్రోత్సాహకర క్రీడా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని వారు సూచించారు.

- Advertisement -

అదేవిధంగా 15 సంవత్సరాల పైబడిన ఆసక్తి కలిగిన క్రీడాకారులు పురుషులు, మహిళలు తమ వార్డులోని వాలంటీర్లకు సమాచారం ఇస్తూ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో ఆడుదాం ఆంధ్ర 2023 షెడ్యూల్, నగదు బహుమతి, నియమ నిబంధనలు పై వాలంటీర్లకు జిల్లా శాప్ కోఆర్డినేటర్స్ అవగాహన కల్పించారు. రిజిస్ట్రేషన్ మరియు నమోదు ప్రక్రియ వాలంటీర్లు త్వరితగతిన పూర్తి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ ఇంచార్జ్ ధోరతి, మండల ఇన్చార్జి వీరన్న, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ ఆసిఫ్, లు విజయ కుమారి, జేసింత, రాజేశ్వరి, పద్మలత,సుంకన్న, రాగన్న, రజాక్, వివిధ వార్డులకు చెందిన వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News