రాయలసీమ యువ క్రీడాకారుల ప్రోత్సహించేందుకు వారి ప్రతిభను వెలికి తీసేలా భూమా ప్రీమియర్ లీగ్ రాయలసీమ స్థాయి గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను బిజెపి సీనియర్ నాయకులు భూమా కిషోర్ రెడ్డి ప్రారంభించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఏవి ఫంక్షన్ హాల్ వెనకాల గల మైదానంలో గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని క్రీడలు మానసిక ఉల్లాసానికి అవసరమన్నారు, క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్య, ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు, దేశంలో ఎందరో క్రీడాకారులు క్రీడల్లో రాణించి అన్ని రంగాల్లో ఉద్యోగాలు రాజకీయ రంగంలో అవకాశాలు పొందారన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు, నేటి ఓటమి రేపటి విజయానికి. నాంది అన్నారు. ఈ టోర్నీకి 48 జట్లు పాల్గొన్నాయని క్రీడాకారులకు అందరికీ భోజన వసతి కల్పించామన్నారు. అనంతరం మ్యాచ్ను ప్రారంభించారు. మొదటి రోజు మదనపల్లె వర్సెస్ నంద్యాల జట్లు తలపడ్డాయి టాస్ గెలిచి మదనపల్లి బ్యాటింగ్ చేసింది ఇందులో మదనపల్లి 6 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేశారు. జట్టులో గని 72 పరుగులు సుమన్ 42 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన నంద్యాల జట్టు 8 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేశారు. 72 పరుగులు చేసిన గని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేశారు. అనంతరం బనగానపల్లె వర్సెస్ పెద్ద వంగలి జట్లు తలబడ్డాయి బనగానపల్లి జట్టు గెలిచింది. ఈ కార్యక్రమంలో భూమా వీరభద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి సూర్యనారాయణ రెడ్డి, దస్తగిరి రెడ్డి ,హెచ్ఆర్ వెంకటేశ్వర్ రెడ్డి డాక్టర్ ప్రసాద్, అంబటి మహేశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి హుస్సేన్ రెడ్డి ,నాగేశ్వర్ రెడ్డి, సర్వాయిపల్లి రాజా, విశ్రాంతి అధ్యాపకులు శంకర్ రెడ్డి రామ్నాథ్ ,హరిచంద్ర రెడ్డి, సురేష్ ,జగన్ రెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.