Friday, November 22, 2024
HomeఆటAllagadda: గెలుపు ఓటమిని సమానంగా తీసుకోండి: భూమా కిషోర్

Allagadda: గెలుపు ఓటమిని సమానంగా తీసుకోండి: భూమా కిషోర్

16 రోజులుగా కొనసాగిన రాయలసీమ గ్రేస్ బాల్ టోర్నమెంటు

రాయలసీమ యువ క్రీడాకారుల ప్రోత్సహించేందుకు వారి ప్రతిభను వెలికి తీసేలా భూమా ప్రీమియర్ లీగ్ రాయలసీమ స్థాయి గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించామని బిజెపి సీనియర్ నాయకులు భూమా కిషోర్ రెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఏవి ఫంక్షన్ హాల్ వెనకాల గల మైదానంలో గ్రేస్ బాల్ టోర్నమెంట్ 16 రోజులుగా కొనసాగిన రాయలసీమ గ్రేస్ బాల్ టోర్నమెంటు నేడు ముగిశాయి. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ టోర్నమెంట్ నిర్వహించామని క్రీడలు మానసిక ఉల్లాసానికి అవసరమన్నారు, క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్య, ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు, దేశంలో ఎందరో క్రీడాకారులు క్రీడల్లో రాణించి అన్ని రంగాల్లో ఉద్యోగాలు రాజకీయ రంగంలో అవకాశాలు పొందారన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు, నేటి ఓటమి రేపటి విజయానికి నాంది అన్నారు. ఈ టోర్నీకి రాయలసీమ నుండి 48 జట్లు పాల్గొన్నాయని క్రీడాకారులకు ఎక్కడ లోటుపాట్లు కలగకుండా అన్ని వసతులు కల్పించామన్నారు. అనంతరం పోటీలో గెలుపొందిన మొదటి బహుమతి కప్పు కైవసం చేసుకున్న కడప సన్నీ ఎక్సెల్ లక్ష రూపాయలు నగదు చెక్కు జట్టుకు భూమా కిషోర్ రెడ్డి హర్షద్వానాల మధ్య అందజేశారు, రెండవ బహుమతి నంద్యాల రామ్ ఎక్సెల్ జట్టుకు 50 వేల రూపాయలు నగదు చెక్కుతో పాటు కప్పును అందజేశారు అలాగే మూడో బహుమతి కర్నూల్ రాయల్ బుల్లెట్ ఎక్స్ఎల్ జట్టుకు 25 వేలు నగదు చెక్కుతోపాటు కప్పును అందజేశారు. పోటీల్లో ప్రతిభా కనబరిచిన వారందరికీ మెడల్స్, ప్రోత్సాహక నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో భూమా వీరభద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి సూర్యనారాయణ రెడ్డి, దస్తగిరి రెడ్డి,హెచ్ఆర్ వెంకటేశ్వర్ రెడ్డి డాక్టర్ ప్రసాద్, అంబటి మహేశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి హుస్సేన్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, సర్వాయిపల్లి రాజా, విశ్రాంతి అధ్యాపకులు శంకర్ రెడ్డి రామ్నాథ్, హరిచంద్ర రెడ్డి, సురేష్, జగన్ రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News