Aman Sehrawat WFI Suspension 2025 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం దక్కించిన యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు పెద్ద దెబ్బ తగిలింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అతనిపై క్రమశిక్షణారాహిత్యం కింద ఏడాది పాటు నిషేధం విధించింది. సెప్టెంబర్ 23, 2025 నుంచి సెప్టెంబర్ 22, 2026 వరకు ఈ బ్యాన్ ఉంటుంది. దీంతో అమన్ అన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల నుంచి దూరంగా ఉంటాడు. ముఖ్యంగా 2026 ఆసియా గేమ్స్‌లో భారత్ తరఫున పాల్గొనలేడు.
బరువు తూకంలో..
కారణం ఏమిటంటే, క్రొయేషియాలో సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు జరిగిన సీనియర్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బరువు తూకంలో విఫలమవ్వడం. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడాల్సిన అమన్, పోటీ రోజు 1.7 కేజీలు ఎక్కువగా ఉండటంతో అనర్హుడిగా ప్రకటించారు. ఈ టోర్నీలో భారత్ తరఫున అంతిమ్ పంఘల్ మాత్రమే మహిళల 53 కేజీలలో కాంస్యం గెలిచింది. WFI ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుని, సెప్టెంబర్ 23న అమన్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చింది. అతను 29న వివరణ సమర్పించాడు కానీ, అది సంతృప్తికరంగా లేదని క్రమశిక్షణ కమిటీ తీర్పు ఇచ్చింది.
Also Read: https://teluguprabha.net/devotional-news/karwa-chauth-fasting-rules-for-unmarried-women-explained/
21 ఏళ్ల అమన్ సెహ్రావత్, హర్యానాలోని జింద్ జిల్లా చీకన్ గ్రామానికి చెందినవాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 57 కేజీల ఫ్రీస్టైల్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచి, భారత్‌కు 7వ ఒలింపిక్ పతకం తీసుకొచ్చాడు. ఇండియాలో యంగెస్ట్ ఒలింపిక్ రెజ్లింగ్ మెడలిస్ట్. 2023 ఏష్యా ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్, కామన్‌వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ వంటి విజయాలు సాధించాడు. అయినా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ముందు క్రొయేషియాలోని పోరెక్‌లో ఆగస్టు 25 నుంచు జరిగిన అక్యుములేషన్ క్యాంప్‌లో బరువును నియంత్రించలేకపోవడం వల్ల ఈ తప్పు జరిగింది.
నా వైపు తప్పు జరిగింది..
ఈ నిర్ణయంపై అమన్ స్పందించాడు. “నా వైపు తప్పు జరిగింది. దాన్ని నేను అంగీకరిస్తున్నాను. WFIకి రాసి బ్యాన్ కాలాన్ని తగ్గించమని కోరతాను” అని అతను చెప్పాడు. WFI లేఖలో “ఈ నిర్లక్ష్యం నిజంగా దెబ్బ తీసింది” అని పేర్కొన్నారు. అమన్‌తో పాటు చీఫ్ కోచ్ జగ్‌మందర్ సింగ్, మరో ముగ్గురు సహాయక సిబ్బందిపై కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారు బరువు పర్యవేక్షణలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు.
ఈ బ్యాన్‌తో అమన్ కెరీర్‌కు పెద్ద నష్టం. 2026 ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్‌లో పాల్గొనలేదు. రెజ్లింగ్ ఫ్యాన్స్, మాజీ అథ్లెట్లు ఈ నిర్ణయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. “యువతకు మార్గదర్శకత్వం ఇవ్వాలి, కఠిన చర్యలు అవసరమే కానీ తగ్గించాలి” అంటున్నారు. అమన్ ఈ సమయంలో శిక్షణ కొనసాగించి, తప్పును సరిదిద్దుకోవాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు. భారత రెజ్లింగ్‌లో ఇది పాఠంగా మారాలి.


