HomeTop StoriesAmitabh praises Vaibhav: నీ వయసులో మేం గల్లీ క్రికెట్ కూడా ఆడలేదు.. వైభవ్‌ను ఆకాశానికెత్తిన...

Amitabh praises Vaibhav: నీ వయసులో మేం గల్లీ క్రికెట్ కూడా ఆడలేదు.. వైభవ్‌ను ఆకాశానికెత్తిన అమితాబ్‌

Amitabh praises Vaibhav Surya vamshi: ఐపీఎల్ రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఓటమి చెందడంతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌ నుంచి నిష్క్రమించింది. అయితే, ఆ జట్టులో తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఈ 15 ఏళ్ల యువ సంచలనం ఆటతీరును అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ తాజాగా మెచ్చుకున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌౦-2 మ్యాచ్‌లో తన జట్టు రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలై ఐపీఎల్‌-2026 టోర్నీ నుంచి వైదొలినప్పటికీ.. వైభవ్‌ సూర్యవంశీ 47 బంతుల్లో 96 పరుగులు చేసి అద్భుతమైన ఆటతీరు కనబర్చాడు. తన చక్కటి ఆటతీరుతో అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేశాడు.

- Advertisement -

Also read: Amaravati: అమరావతిలో ఆ సంస్థలకు భూ కేటాయింపులు.. కీలక వివరాలు వెల్లడించిన మంత్రి నారాయణ

నీ వయస్సులో మేం గల్లీ క్రికెట్ కూడా ఆడలేదు..

ఈ నేపథ్యంలో వైభవ్‌ను ఆకాశానికెత్తుతూ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఎక్స్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. “నీ వయసులో మేం కనీసం గోళీలు, గల్లీ క్రికెట్‌ కూడా సరిగ్గా ఆడలేదు. కానీ, నువ్వు మాత్రం నీ ఆటతో ఔరా అనిపించావు. నువ్వో అద్భుతానివి” అని ప్రశంసించారు. ఏకంగా బిగ్‌ బీ అమితాబ్‌ నుంచి ప్రశంసలు దక్కడంతో వైభవ్‌ సూర్య నెటిజన్లకు హాట్‌ ఫేవరెట్‌గా మారాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News